Prudhvi Raj: జగన్ తో పదేళ్ల కాపురం-ముద్రగడకేం తెలుసు ? రోజాను తట్టుకోలేక-పృధ్వీసెటైర్లు..!
ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అదే సమయంలో నేతల మధ్య సెటైర్లు, పంచ్ లు పేలుతున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన అభ్యర్ధి పులివర్తి రామాంజనేయులు తరఫున ప్రచారం నిర్వహించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్.. కాపు నేత ముద్రగడ పద్మనాభంతో పాటు మంత్రి ఆర్కే రోజాపై తనదైన శైలిలో పంచ్ లు విసిరారు.
జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పృధ్వీరాజ్.. సీఎం జగన్ తో పాటు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం, మంత్రి రోజాపై విమర్శలు చేశారు. ముద్రగడ పద్మనాభం రెడ్డి కాపుగా మారారని, తాను మూడు రోజులుగా పిఠాపురం లోనే ఉన్నానని, ఆయన ఎక్కడా కనబడలేదన్నారు. బహుశా గుడిమెట్ల దగ్గర అడుక్కొని ఉంటాడని వ్యాఖ్యానించారు. ముద్రగడ పద్మనాభానికి సిగ్గులేదన్నారు. రెడ్డి సంక నాకుతున్నాడని, నాది కూడా భీమవరం ప్రక్కన తాడేపల్లిగూడెం అని అన్నారు.

బటన్ రెడ్డి కోసం పాకులాడుతున్న ముద్రగడకు ఏం తెలుసని, పదేళ్లపాటు ఆయనతో కాపురం చేసిన తనకు జగన్ గురించి అన్ని తెలుసని పృథ్వీరాజ్ తెలిపారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పెడితే ఇది సాధ్యమా అని ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆయన నవరత్నాల ప్రకటన సమయంలో మేము సాధ్యమా అని అడిగితే తప్పుగా అనిపించిందా అని ప్రశ్నించారు.
మరో సంకరజాతి నాయకుడు ఉన్నాడని, అతను కాపు అని చెప్పుకోవడానికి తాము సిగ్గుపడుతున్నామన్నారు, ఇరిగేషన్ పై సమీక్షలు పెట్టడం మానేసి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని మాట్లాడుతున్నారని, ఆయన చెల్లెల్ని పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుని వదిలేసారా అంబటిపై పృథ్విరాజ్ సెటైర్లు వేశారు.
జబర్దస్త్ లో అవకాశాల కోసం తిరిగిన రోజా మంత్రిగా వేల కోట్లు ఎలా సంపాదించారని, రోజాని తట్టుకోలేక ఆయన మొగుడు చెన్నైలో ఉంటున్నాడని పృధ్వీరాజ్ సంచలన విమర్శలు చేశారు. ఉమ్మడి కూటమి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ స్థానిక వైసీపీ అభ్యర్థి గ్రంది శ్రీనివాస్ తనను నాన్ లోకల్ అంటాడని, ముసలోడు అంటున్నారని, ఆయన విగ్గు తీసేస్తే ఆయన కూడా ముసలోడేనని విమర్శించారు. భీమవరంలో తాను 40 వేల ఓట్ల మెజార్టీతో అధికారంలోకి వస్తున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications