పవన్ నామినేషన్ ర్యాలీలో పాల్గొనబోయే టాలీవుడ్ సెలెబ్రిటీలు వీళ్లే..!!
Pawan Kalyan: పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతంగా కొనసాగుతోంది. అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల తీవ్రతను పెంచాయి. అదే సమయంలో నామినేషన్ల పర్వం కూడా జోరెత్తింది. మూడొంతులకు పైగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 25వ తేదీ తుది గడువు. నామిషన్లను వేయడానికి ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

తాజాగా పవన్ కల్యాణ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన తెలుగుదేశం-జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వంగ గీత- ఇక్కడి నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఆమె తన నామినేషన్ దాఖలు చేశారు.
గొల్లప్రోలు టౌన్ ఎంట్రీ హైవే వద్ద పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీ ప్రారంభమౌతుంది. గొల్లప్రోలు ఎమ్మార్వో కార్యాలయం, సూరీడు చెరువు, పిఠాపురం దూళ్ల సంత, చర్చి సెంటర్, పిఠాపురం బస్టాండ్, ఉప్పాడ బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ రోడ్, ఎంపీడీఓ ఆఫీస్ మీదుగా పాద గయ క్షేత్రానికి చేరుకుంటుంది. అక్కడితో ర్యాలీ ముగుస్తుంది.
ఈ ర్యాలీలో పాల్గొనడానికి పవన్ కల్యాణ్‌కు మద్దతు ఇచ్చిన టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే పిఠాపురానికి చేరుకున్నారు. నిర్మాతలు బన్నీ వాసు, శ్రీనివాసకుమార్, బేబీ దర్శకుడు సాయి రాజేష్.. పిఠాపురానికి వచ్చారు. వారితో పాటు జనసేన స్టార్ క్యాంపెయినర్లు నాగబాబు, కోరియోగ్రాఫర్ జానీ, నటులు పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీను, సాగర్.. ర్యాలీలో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications