'తాట తీస్తా', 'ఆడి పేరేందిరా బై', అవసరాలు మారుస్తాయి: కెసిఆర్- పవన్ భేటీపై రామ్‌గోపాల్ వర్మ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu
  Pawan & KCR's meeting : కేసీఆర్ - పవన్ భేటీ : 'తాట తీస్తా', 'ఆడి పేరేందిరా బై' !

  హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం కెసిఆర్ ల భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ తరుణంలో పవన్ కళ్యాణ్, కెసిఆర్‌తో భేటీ కావడంపై సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.గత ఎన్నికల సమయంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు చేసుకొన్న విమర్శలను ప్రస్తావిస్తూ వర్మ చేసిన పోస్ట్ ప్రస్తుతం రాజకీయ నేతల తీరుపై చర్చకు దారి తీసింది.

  శుభవార్త: జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం, పవన్ ప్లాన్ ఇదే

  2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమికి వపన్ కళ్యాణ్ మద్దతిచ్చారు. కానీ, 2018 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

  జనసేన వైఖరి అర్ధం కాలేదు, కాంగ్రెస్ గెలిస్తే పునర్విభజన చట్టం అమలు: ఉండవల్లి

  తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలోనూ, గత ఎన్నికల సమయంలోనూ పవన్ కళ్యాణ్, కెసిఆర్ మధ్య మాటల యుద్దం చోటు చేసుకొంది. కానీ, కొత్త సంవత్సరం రోజున ఇద్దరు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

  కెసిఆర్, పవన్ కళ్యాణ్ మాటల యుద్దాన్ని ప్రస్తావించిన వర్మ

  కెసిఆర్, పవన్ కళ్యాణ్ మాటల యుద్దాన్ని ప్రస్తావించిన వర్మ

  రామ్ గోపాల్ వర్మ సంచనాలకు , వివాదాలకు ఇటీవల కాలంలో కేంద్ర బిందువుగా మారాడు. ట్విట్టర్ వేదికగా చేసుకొని ఇటీవల కాలంలో చేసిన పోస్టులు సంచనాలకు దారితీశాయి. అయితే ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పి, ఫేస్ బుక్ పోస్టుల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే కెసిఆర్ తో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం సమావేశం కావడంపై రామ్ గోపాల్ వర్మ పాత చరిత్రను తిరగదోడారు. ఒకరిపై ఒకరు చేసుకొన్న విమర్శలను ప్రస్తావిస్తూ పోస్టు చేశారు.

  తాట తీస్తా, ఆడి పేరేందిరా బై

  తాట తీస్తా, ఆడి పేరేందిరా బై

  గత ఎన్నికల సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కెసిఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను రామ్ గోపాల్ వర్మ ప్రస్తావించారు. తాట తీస్తానని కెసిఆర్ పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ప్రస్తావించారు. అయితే దీనికి కౌంటర్ గా కెసిఆర్ పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలను కూడ ప్రస్తావించారు.ఆడి పేరేందిరా బై అంటూ కెసిఆర్ ఓ బహిరంగ సభలో తనదైశిలో పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలను వర్మ ప్రస్తావించారు.

  రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పలేం

  రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పలేం

  రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పలేం. అందుకు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ, ఉండరని చెబుతుంటారు. పవన్ కళ్యాణ్, కెసిఆర్ భేటీ గురించి రాజకీయ పరిశీలకులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కూడ ఒకరిపై మరోకరు విమర్శలు గుప్పించుకొన్నారు. కానీ, వారిద్దరూ కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

  అవసరాలు మార్చేస్తాయి

  అవసరాలు మార్చేస్తాయి

  అవసరాలు రాజకీయాలను మార్చేస్తాయని అంటూ రామ్ గోపాల్ వర్మ కెసిఆర్, పవన్ కళ్యాణ్ భేటీపై వ్యాఖ్యలు గుప్పించారు. వీరిద్దరూ భేటీకి సంబంధించిన ఫోటోను తన పోస్టులో పెట్టారు. రాజకీయాల్లో అవసరాల ఆధారంగా నేతలు మాట్లాడుతుంటారని వర్మ అభిప్రాయపడ్డారు. జై రాజకీయనాయకుల్లారా అంటూ వర్మ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tollywood director Ram Gopal Varma sensational comments on Pawan kalyan and Telangana CM Kcr's meeting on Tuesday. KCR and Pawan Kalyan were made allegations each and other few days back, varma reminded that comments in his post.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి