చిరంజీవి అండ్ టీమ్ కోసం అంబానీ ఫ్లైట్: రిలయన్స్ విమానంలో విజయవాడకు: వైసీపీ ఎంపీ లాబీయింగ్?

అమరావతి: ఏపీలో భారీ బడ్జెట్ సినిమాల సందడి ఇంకొద్దిరోజుల్లో మొదలు కాబోతోంది. వందల కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిన సినిమాలను వరుసబెట్టి విడుదల కానున్నాయి. ప్రేక్షకులను పలకరించనున్నాయి. పవన్ కల్యాణ్-రానా నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లానాయక్, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ ఆర్, ప్రభాస్-పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన రాధేశ్యామ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు, కీర్తిసురేష్ సర్కారువారి పాట, మెగాస్టార్ నటించిన ఆచార్య..ఇవన్నీ ఉప్పెనలా అభిమానులను ముంచెత్తనున్నాయి.

కొలిక్కి రాని టికెట్ల వ్యవహారం..

కొలిక్కి రాని టికెట్ల వ్యవహారం..

ఈ పరిస్థితుల్లో- ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం కొలిక్కి రాకపోవడం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలను కలవరపాటుకు గురి చేస్తోంది. సినిమా టికెట్లపై ప్రభుత్వ నియంత్రణ తొలగిపోతే గానీ.. సినిమా చిత్రీకరణపై పెట్టిన ఖర్చు వెనక్కి రాదనే ఆందోళన నిర్మాతల్లో నెలకొని ఉంది. టికెట్ల రేట్లను పెంచుకునే విషయంపై ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని కలిసినప్పటికీ.. పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. రేట్ల వ్యవహారంలో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

 చిరంజీవికే బాధ్యతలు..

చిరంజీవికే బాధ్యతలు..

అక్కినేని నాగార్జున కూడా వైఎస్ జగన్‌ను కలిసినప్పటికీ.. అది లంచ్ మీటింగ్‌గా ముగిసిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల మధ్య మరోసారి- ఈ అంశం తెరమీదికి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి బరిలోకి దిగారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవికి గుర్తింపు ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం కూడా ఇదివరకు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

 వైఎస్ జగన్‌తో భేటీ..

వైఎస్ జగన్‌తో భేటీ..

ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడానికి టాలీవుడ్ పెద్దలు కొద్దిసేపటి కిందటే విజయవాడకు చేరుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకులు ఎస్ఎస్ రాజమౌలి, కొరటాల శివ, ప్రముఖ హాస్యనటుడు అలీ, ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ పోసాని కృష్ణమురళి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

 ప్రత్యేక విమానంలో..

ప్రత్యేక విమానంలో..

ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వారంతా బయలుదేరారు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌలి, కొరటాల శివ.. ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆర్ నారాయణ మూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకున్నారు. చిరంజీవి అండ్ టీమ్ రావడానికి ముందే వారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. చిరంజీవి, మిగిలిన వారు వచ్చిన తరువాత వైఎస్ జగన్‌ను కలిశారు.

 వైసీపీ ఎంపీ ఏర్పాటు చేశారా?

వైసీపీ ఎంపీ ఏర్పాటు చేశారా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని ఈ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్పొరేట్ వ్యవహారాలు, ప్రాజెక్టుల విభాగానికి గ్రూప్ ప్రెసిడెంట్ ఆయన. రెండు సంవత్సరాల కిందటే పరిమళ్ నత్వానీ.. వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ తరఫున ఆయనను రాజ్యసభకు పంపించారు వైఎస్ జగన్. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఆయనే ఈ ఫ్లైట్‌ను ఏర్పాటు చేశారనే ప్రచారం సాగుతోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+