పవన్ కల్యాణ్ కోసం కదిలిన తెలుగు ఇండస్ట్రీ
పిఠాపురం.. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసిన ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ..వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
కూటమి తన గెలుపుకు కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు. పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కల్యాణ్ విసృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం జబర్థస్త్ నటులు సైతం రంగంలోకి దిగారు. మెగా హీరో వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ,నాగబాబు ,ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు.పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కల్యాణ్ విసృతంగా ప్రచారం నిర్వహించారు.

త్వరలో రాష్ట్రంలో కూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని నటి ఖుష్బు తెలిపారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయన పిలిస్తే ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తానని ఖుష్బు తెలిపారు. తాజాగా పలువురు టాలీవుడ్ హీరోలు సైతం పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే జబర్దస్త్ నటులు, మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మద్దతు తెలుపుతూ వీడియోలు, పోస్ట్‌లు రిలీజ్ చేశారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్న తేజా సజ్జా కూడా తన మద్దతు పవన్ కల్యాణ్‌కే అన్నట్టుగా పోస్ట్ పెట్టాడు. మరో హీరో రాజ్ తరుణ్ సైతం పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్ల మీకున్న విజన్, కష్టపడుతున్న తీరును నేను ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాను. కోట్ల మంది ప్రజలు ఆశిస్తున్నట్లుగా నేను కూడా ఎంతో ఆశతో ఉన్నాను. ఉజ్వల భవిష్యత్ ను అందిస్తారని, మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నాను.
ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి' అంటూ పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశాడు హీరో రాజ్ తరుణ్. ఇక హనుమాన్ హీరో తేజ సజ్జా అయితే త్వరలోనే మన అందరికీ ఓ బిగ్ డే రాబోతోంది.. పవన్ కల్యాణ్ సర్ మమ్మల్ని గర్వపడేలా చేయండి అంటూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో పవన్ గెలుపు కోసం టాలీవుడ్ హీరోలందరూ కూడా కదిలినట్టు అయింది. ఎన్నికలకు ఇంకా ఐదు రోజులు సమయం ఉండటంతో మరికొంతమంది హీరోలు పవన్‌కు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications