బాలయ్య-చిరు ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్-ఆర్ నారాయణ మూర్తి షాకింగ్ ..!
ఏపీ రాజకీయాలకూ, టాలీవుడ్ కూ సుదీర్ఘ బంధం ఉంది. ఏపీలో ఏం జరిగినా ఆ ప్రభావం టాలీవుడ్ పై ఉంటుంది, అలాగే టాలీవుడ్ లో జరిగే పరిణామాలకూ ఏపీలో రాజకీయాలు ప్రభావితం అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అనూహ్యంగా జగన్ హయాంలో జరిగిన టాలీవుడ్ భేటీ, చిరంజీవి ప్రస్తావన తీసుకురావడంతో బాలయ్య ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు వైసీపీ, మెగా అభిమానుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.
ఈ నేపథ్యంలో అసలు జగన్ తో టాలీవుడ్ భేటీ జరిగిన రోజు ఏం జరిగింది, ఇప్పుడు దీనిపై చర్చ ఎందుకున్న దానిపై టాలీవుడ్ సీనియర్ నటుడు ఆర్ నారాయణమూర్తి స్పందించారు. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి స్పందన 100 శాతం నిజమని ఆయన తెలిపారు. జగన్ ను కలిసిన వాళ్లలో తాను కూడా ఉన్నట్లు గుర్తుచేశారు. జగన్ గవర్నమెంట్ ఎవరినీ అవమానించలేదన్నారు.

చిరంజీవి ఆధ్వర్యంలో తాము జగన్ మోహన్ రెడ్డిని కలసినప్పుడు ఆయన ఎంతో గౌవరం ఇచ్చారన్నారు. గత గవర్నమెంటు తమ సినిమా వాళ్ళను అవమానించలేదన్నారు. గత గవర్నమెంట్ చిరంజీవి గారిని అవమానించారు అని ప్రచారం తప్పన్నారు.
చిరంజీవి తనకు స్వయంగా ఫోన్ చేశారని, అది ఆయన సంస్కారం అన్నారు. అందరూ చిరంజీవి నివాసంలో కలిశామన్నారు.
చిరంజీవి పరిశ్రమ పెద్దగా సీఎం జగన్ తో మాట్లాడారన్నారు.

చిరంజీవి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారం అయిందన్నారు. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని నారాయణమూర్తి కోరారు. తాను బాలకృష్ణ గురించి మాట్లాడదల్చుకోలేదన్నారు. సినిమా టికెట్ ధరలు పెంచకూడదని తెలిపారు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమే అన్నారు. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతాడన్నారు.












Click it and Unblock the Notifications