మూణ్ణాలుగు కుటుంబాల చేతుల్లో సినీ పరిశ్రమ, అందరికీ ఇవ్వండి: కోదండ
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ కేవలం మూడు నాలుగు కుటుంబాల చేతుల్లోనే ఉందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ గురువారం అన్నారు. థియేటర్ల పైన కూడా వారిదే గుత్తాధిపత్యమన్నారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ను గుర్తించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. తెలంగాణ పరిశ్రమలకు రాయితీలు, ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు. సినిమా పరిశ్రమలో శ్లాబ్ విధానం రద్దు చేయాలన్నారు. టిక్కెట్ల ఆధారంగా పన్నును వసూలు చేయాలని కోరారు.

సినిమా రంగంలో అందరికీ సమాన అవకాశాలు రావాలన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ను వెంటనే గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం నాడు తెలంగాణ జేఏసీ నాయకులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు.
కాగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములు తీసుకొని పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెబుతున్నారని, రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి బుధవారం మండిపడ్డారు.












Click it and Unblock the Notifications