వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు

|
Google Oneindia TeluguNews

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీమంత్రి భూమా అఖిలప్రియ జైలు నుంచి బయటకు వచ్చారు. అసలు ఏం జరిగిందో రేపు (ఆదివారం) వెల్లడిస్తానని అఖిలప్రియ తెలిపారు. కిడ్నాప్ కేసుపై అన్ని విషయాలు మాట్లాడతానని ప్రకటించారు. చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన ఆమె నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. సుకు సంబంధించిన అన్ని వివరాలు మీడియా ముందుకు తీసుకువస్తానని చెప్పారు.

Recommended Video

#Akhilapriya బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: ఎట్టకేలకు అఖిలప్రియ జైలు నుంచి విడుదల
జైలు నుంచి విడుదల

జైలు నుంచి విడుదల

బోయిన్‌పల్లి కేసులో అఖిలప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు సెషన్స్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరుచేసిన సంగతి తెలిసిందే. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ చంచల్‌గూడ జైలులో 17 రోజులుగా రిమాండ్‌లో ఉంటున్న విషయం తెలిసిందే.

ఏ-3 భార్గవ్ రామ్

ఏ-3 భార్గవ్ రామ్

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ ఘటన అనేక మలుపులు తిరిగింది. ఈ కేసులో ఏ1 అఖిలప్రియ ఇప్పటికే అరెస్టవ్వగా.. ఏ2 సుబ్బారెడ్డిని విచారించి, వదిలేశారు. అఖిలప్రియపై 448, 419, 341, 342, 506, 366, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత ఆమెపై పోలీసులు మరో రెండు సెక్షన్లు (ఐపీసీ 147, 385) జోడించారు. కిడ్నాప్‌ కేసులో ప్రాథమిక దర్యాప్తులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌కు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. భార్గవరామ్‌‌ను ఏ3గా పోలీసులు పేర్కొన్నారు.

 బెయిల్ ఆర్డర్ కాపీలు రావడంతో రిలీజ్

బెయిల్ ఆర్డర్ కాపీలు రావడంతో రిలీజ్

అఖిలప్రియకు సంబంధించి బెయిల్ ఆర్డర్ కాపీలను చంచల్‌గూడ జైలు అధికారులు ఆమె తరపు న్యాయవాదులు సమర్పించారు. అనంతరం ఆమెను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. అఖిలప్రియకు స్వాగతం పలికేందుకు ఆమె స్వంత గ్రామం ఆళ్లగడ్డ నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు వచ్చారు. ప్రతి సోమవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సిందేనని షరతు విధించారు.హైదరాబాద్‌ విడిచి ఎక్కడికీ వెళ్ళడానికి.. పోలీసుల విచారణకు సహకరించాలని షరుతులతో కూడిన బెయిల్‌ను సెషన్స్‌ కోర్టు మంజూరు చేసింది.

English summary
tomorrow i will speak ex minister bhuma akhilapriya said to media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X