Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్విట్టర్ లో జోరుగా ట్రెండ్ అవుతున్న జగన్ హ్యాష్ ట్యాగ్; రచ్చ మాములుగా లేదుగా!!

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ పరిపాలన లో విద్యుత్ చార్జీలు పెంచేసి, ఎండాకాలంలో ప్రతిరోజు అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న తీరుకు వ్యతిరేకంగా ట్విట్టర్లోనూ జగన్ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండింగ్ అవుతోంది. 2019 ఎన్నికలలో వైయస్సార్ సిపి నినాదంగా వాడిన ByeByeBabu ను మార్చేసి ఇప్పుడు ByeByeYSJagan అంటూ ఏపీ ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు.

అప్పుడు బైబైబాబు.. ఇప్పుడు బైబై జగన్.. ఎందుకంటే


2019 ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో ByeByeBabu అంటూ వైయస్ జగన్ సోదరి షర్మిల ప్రతి ప్రసంగం లోనూ తప్పనిసరిగా వాడేవారు. ఇక ఈ హ్యాష్ ట్యాగ్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలలో విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాలనలో ప్రజాసంక్షేమం కోసం ఏమీ చేయలేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు పదేపదే జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడుతున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా నూ జగన్ ఫెయిల్యూర్ సీఎం, ByeByeYSJagan అంటూ హ్యాష్ ట్యాగ్ లతో జగన్ పరిపాలన ఎండగడుతూ ఉన్నాయి.

అప్రకటిత విద్యుత్ కోతలపై నెటిజన్ల నిరసనలు .. ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం దాదాపు 10 గంటల వరకూ అప్రకటిత కరెంటు కోతలు విధించడంతో ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కరెంటు కోతలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా #ByeByeYSJagan పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు కరెంటు కోతలపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఇక వైయస్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ మీమ్స్ కూడా జోరుగా పోస్ట్ చేస్తున్నారు. జగన్ పరిపాలన పై, ప్రస్తుత కరెంట్ కోతలపై సెటైర్లు వేస్తున్నారు.

కరెంట్ కోతలపై ఏపీ సర్కార్ పై సోషల్ మీడియాలో సెటైర్లు

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశాన్ని, ఉద్యోగ నియామకాలు, మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా, సి పి ఎస్ రద్దు తదితర హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్న ప్రజలు తాజా కరెంటు కోతల పైన కూడా ByeByeYSJagan అంటూ హ్యాష్ ట్యాగ్ తో తమదైన శైలిలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. టిడిపి నేతలు విజనరీ చంద్రబాబు పాలనలో కరెంటు కోతలు లేవని ప్రిజజరీ వైయస్ జగన్ పాలనలో అసలు కరెంటు ఉండటం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక కరెంట్ బిల్లు ఎందుకు ఎక్కువ వచ్చింది అమ్మ అని కొడుకు ప్రశ్నిస్తే నాలుగు లోనూ 5 లోనో ఉంచాల్సిన ఫ్యాన్ ని 151 లో ఉంచితే అలాగే ఉంటుంది రా అంటూ మీమ్ పోస్ట్ చేసి సెటైర్లు వేశారు.

ByeByeYSJagan హ్యాష్ ట్యాగ్ ట్రెండ్.. ప్రతిపక్షాల పనేనని వైసీపీ మండిపాటు

జగన్ ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ హామీలన్నీ గోవిందా అంటూ జగన్ వీడియోలు పోస్ట్ చేసి మరి ByeByeYSJagan అంటున్నారు. ఇలా లెక్కకు మిక్కిలిగా అనేక మీమ్స్ జగన్ పై తెగ వైరల్ గా మారాయి. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండింగ్ లో ఉంది. ఎవరికి తోచినట్లుగా వారు ప్రభుత్వ వైఖరిపై తమలో ఉన్న అసహనాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ByeByeYSJagan హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు ప్రతిపక్ష పార్టీల పై విరుచుకుపడుతున్నారు. ఏపీలో జగన్ సుపరిపాలన భరించలేక ఇదంతా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ ను ఈ విధంగా అవమానిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఇలా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+