కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప 'లెక్క' మారుస్తానంటున్నారే..!?

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఎంత కీలకమో, అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే కీలకం. రెండు పార్టీల అధినేతలు వైఎస్ జగన్, చంద్రబాబు వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలై ఉన్నారు. ఎవరికి వారు వారి సొంత నియోజకవర్గాల్లో దెబ్బ తీయగలిగితే ప్రత్యర్థిపై మానసికంగా పైచేయి అవుతుందని భావిస్తున్నారు. వైఎస్ జగన్ కుప్పంపై దృష్టిపెట్టగా, చంద్రబాబు మొత్తంగా కడప జిల్లాపై తన దృష్టిని కేంద్రీకరించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడంతోపాటు కీలక మలుపులకు కారణమవుతున్నాయి.

 కుప్పంలో జగన్, కడపలో చంద్రబాబు!

కుప్పంలో జగన్, కడపలో చంద్రబాబు!

కుప్పంలో చంద్రబాబును ఓడించడంద్వారా పై చేయి సాధించాలని జగన్ భావిస్తుండగా, అందుకు విరుగుడుగా కడప జిల్లా మొత్తం ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు బరిలోకి దిగారు. పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో మార్పు చేర్పులను సూచిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం, టీడీపీపై జగన్ అనుసరిస్తున్న వైఖరి, ముఖ్యమైన నాయకులపై నమోదవుతున్న కేసుల్లాంటివి వారిలో కసిని రేకెత్తిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

సీఎం సొంత జిల్లాలో పాగా వేస్తాం!

సీఎం సొంత జిల్లాలో పాగా వేస్తాం!


జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో విజయం సాధించాలనే కసితో అక్కడి పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. జిల్లాలో గత ఎన్నికల్లో 10 నియోజకవర్గాలుండగా మొత్తం 10 స్థానాల్లో వైసీపీ విజయదుందుభి మోగించింది. టీడీపీ ఒక్క నియోజకవర్గంలో కూడా పాగా వేయలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో మాత్రం అన్ని నియోజకవర్గాలు గెలుచుకోవాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఇలా టార్గెట్ పెట్టుకోవడంవల్ల ఫలితాలు వచ్చే సమయానికి కనీసం సగం స్థానాల్లో గెలవగలమనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చింది.

ఆరు టీడీపీకి, నాలుగు వైసీపీకి..

ఆరు టీడీపీకి, నాలుగు వైసీపీకి..


తెలుగుదేశం పార్టీకి మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, రాజంపేటల్లో బలముంది. పులివెందుల, కడప, బద్వేల్, రాయచోటిలో వైసీపీకి బలముంది. ముందుగా తనకు బలమున్న ఆరు నియోజకవర్గాల్లో జెండా ఎగరవేయాలని చంద్రబాబు జిల్లా నేతలకు స్పష్టం చేశారు. అవసరమైతే తానే ఒకటికి నాలుగుసార్లు పర్యటిస్తానని, షెడ్యూల్ ఖరారు చేయాలని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా వైసీపీ నేతలపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని, కష్టపడితే కచ్చితంగా గెలుస్తామని జిల్లా నేతలు చంద్రబాబుకు హామీ ఇస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు చెబుతున్నది నిజమేనా? కాదా? అనేది తెలియాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేంతవరకు ఎదురుచూడక తప్పదు.

English summary
The upcoming elections are as crucial for the opposition Telugu Desam Party as they are for the ruling YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X