హెచ్చరిక: బంగాళాఖాతంలో రెండు అల్పపీడన ద్రోణులు
బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడన ద్రోణలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తమిళనాడుకు సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ీనెల 7, 8 తేదీల్లో తుఫానుకు అవకాశం ఉందని ఒక ప్రయివేటు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ ప్రభావంతో రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. ఇంకొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి.
ఈరోజు తేలికపాటి వర్షాలు
ఏపీలో రానున్న రెండురోజులు భారీ వర్షాలు కురవనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి, మన్యం జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే గుంటూరు, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఓవైపు వానలు.. మరోవైపు ఎండలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను ప్రభుత్వం ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిసా, మహారాష్ట్ర రాష్ట్రాలపై ఉండనుంది. అలాగే దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం విస్తరించివుందని, జార్కండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వైపు ఇది కదులుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. వర్షాలు కురిసినన్ని రోజులు వాతావరణం బాగానే ఉన్నప్పటికీ వానలు తెరిపినివ్వగానే ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఓవైపు వానలు, ఓవైపు ఎండలతో ఏపీలో చిత్రమైన వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications