కర్ణాటకలో ఫలితాలే తెలంగాణలోనూ - బజరంగ్ బలీ ఎఫెక్ట్..!!
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు మేజిక్ ఫిగర్ సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ మేరకు కాంగ్రెస్ 125 స్థానాల వరకు ఆధిక్యతలో కొనసాగుతోంది. బీజేపీ 70 స్థానాల్లోనే ప్రస్తుతం ఆధిక్యతలో ఉంది. ముఖ్యమంత్రి బొమ్మ పరోక్షంగా పరాజయం అంగీకరించారు. ఈ సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ట్రెండ్స్ పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని ధీమా తో కనిపించారు. కేసీఆర్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణలో కర్ణాటక ఎఫెక్ట్: దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం చేజారింది. హస్తం వశం అవుతోంది. వెల్లడవుతన్న ట్రెండ్స్ కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యతను సూచిస్తున్నాయి. మేజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ సొంతగా చేరుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. జేడీఎస్ సహకారం లేకుండానే కాంగ్రెస్ అధికారం దక్కించుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు ఈ ఫలితాలు దేశ వ్యాప్తంగా జోష్ ను ఇచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల కు సిద్దం అవుతున్న వేళ ఈ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. బజరంగ్ బలీ కాంగ్రెస్ ను గెలింపించారని వ్యాఖ్యానించారు. ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూల తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

జేడీఎస్ ఓడిందంటే కేసీఆర్ సైతం: జేడీఎస్ తో బీజేపీ టచ్ లోకి వచ్చిందనే వార్తల పైన రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. జేడీఎస్ కు తెలంగాణ ముఖ్యమంత్రి సహకారం అందించారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీజేపీ నేతలతో జేడీఎస్ నేతలు టచ్ లో ఉండటం పైన కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేసారు. శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలన్నారు. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారని ..శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించడని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీ ని, జేడీఎస్ ను ఓడించి కేసీఆర్ ను తిరస్కారించారని రేవంత్ చెప్పుకొచ్చారు. దేశ వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేసారు.

తెలంగాణలోనూ కాంగ్రెస్ జోష్:
తెలంగాణలోను స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ చెప్పుకొచ్చారు. ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారన్నారు. కేసీఆర్ మద్దతు ఇచ్చిన జేడీఎస్ ఓడిపోయిందని.. జేడీఎస్ తో పాటుగా కేసీఆర్ కూడా ఓడినట్లేనని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ మత రాజకీయాలను కన్నడ ప్రజలు తిప్పికొట్టారని విశ్లేషించారు. రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటకలోనే కాంగ్రెస్ విజయం సాధ్యమైందని రేవంత్ పేర్కొన్నారు. ఇప్పుడు కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంటే బీజేపీ కార్యాలయం బోసి పోయింది.












Click it and Unblock the Notifications