పాల్వాయికి కాంగ్రెస్ షోకాజు నోటీసు: మరో ఎమ్మెల్సీకీ..

కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులపై చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వడంతోనే టిపిసిసి వీరికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా,
నల్గొండ జిల్లాలోని మునుగోడులో కాంగ్రెస్ రెబల్ అసెంబ్లీ అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలోనే పాల్వాయికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవల కేంద్రమంత్రి జైరాం రమేష్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి ఇంటికెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లాలోని మునుగోలు నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా నామినేషన్ వేసిన పాల్వాయి కుమార్తె స్రవంతి రెడ్డితో నామినేషన్ ఉపసంహరింపచేయాలని జైరాం రమేష్ ఆయనకు సూచించారు.
పాల్వాయితో సమావేశమైన జైరాం రమేష్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా జైరాం రమేష్ హెచ్చరించారు. కాంగ్రెస్-సిపిఐ పొత్తులో భాగంగా మునుగోలు సీటును సిపిఐకి కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిని పోటీకి దింపలేదు.












Click it and Unblock the Notifications