ప్రకాశం బ్యారేజ్ కూల్చటానికి జగన్ కుట్ర వీడియో.. అంబటి రాంబాబు తేల్చేశారుగా!

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీ కొట్టిన ఘటన ఏపీ రాజకీయాలలో ఇంకా విమర్శలు, ప్రతి విమర్శలకు కారణంగా మారింది. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీ కొట్టిన ఘటన పైన టిడిపి, వైసిపిలు ఒకరి పైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బోట్ల యజమానులు వైసిపి నాయకుడు నందిగం సురేష్ కు అనుచరులని తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు మండిపడుతుంటే బోట్ల యజమానులు లోకేష్ కు సన్నిహితులని వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తుంది.

జగన్ టార్గెట్ గా టీడీపీ పోస్ట్
ఒకరిపై ఒకరు మాటలు దాడి చేసుకోవడంతో పాటు దీనిపైన పెద్ద ఎత్తున రాజకీయం చేయడంతో ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటన పైన దుమారం రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రకాశం బ్యారేజీని కూల్చేసే కుట్ర కింగ్ మేకర్ జగన్మోహన్ రెడ్డి చేశారని వైసీపీ దుష్ట చతుష్టయం దీనిని అమలు చేసిందని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో..

TPD Posted Jagan conspiracy to demolish Prakasam barrage video ambati rambabu satires on chandrababu and lokesh

ప్రకాశం బ్యారేజ్ కూల్చే కుట్ర .. యానిమేషన్ వీడియో
ఈ పోస్టులో తలశిల రఘురాం, నందిగం సురేష్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని జగన్ చెప్పినట్టు . పెద్ద పెద్ద ఇసుకతో ఉన్న బోట్లను ప్రకాశం బ్యారేజీ లోకి వదలాలని, అప్పుడు అవి బ్యారేజ్ ని గుద్దుకోవడం వల్ల బ్యారేజ్ కూలిపోతుందని దానివల్ల ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న ప్రజలందరూ చనిపోతారని జగన్ వాయిస్ ఇమిటేట్ చేస్తూ యానిమేషన్ వీడియో పోస్ట్ చేశారు.

జగన్ పై చేసిన వీడియోపై అంబటి రాంబాబు సెటైర్లు
దీనికి చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని ఆ తర్వాత తాను సీఎం కావచ్చు అని చెప్పినట్టుగా ఒక యానిమేషన్ వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టును ట్యాగ్ చేసిన అంబటి రాంబాబు పచ్చి అబద్దాన్ని నమ్మించడానికి తండ్రి కొడుకులు పడరాని పాట్లు పడుతున్నారని నారా చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ ని టార్గెట్ చేశారు.

టీడీపీ ప్రచారాన్ని తిప్పికొడుతున్న జగన్
ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా చంద్రబాబు దానికి జగనే కారణమని చెబుతున్నారని, రాష్ట్ర ప్రజలకు నిజాయితీగా పాలన అందించాల్సిన ప్రభుత్వం, వరదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, విజయవాడతోపాటు అనేక ప్రాంతాల ప్రజలు ముంపుకు గురికావడానికి కారణమైందని విమర్శిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ లో బోట్ల వ్యవహారాన్ని టిడిపి సృష్టిగా అభివర్ణిస్తూ టార్గెట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+