పెళ్లింట విషాదం: ప్రమాదంలో వధువు తండ్రి మృతి

సికింద్రాబాద్‌లోని లాలాపేటకు చెందిన కాంట్రాక్టరు చింతపట్ల మదనాచారి అలియాస్ మదన్ (56), శారద (52) దంపతుల కూతురు సౌమ్య (24) వివాహం మలక్‌పేట నివాసముంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గాడిల సాయినాథాచారి (28)తో శుక్రవారం జరిగింది. ఆదివారం సాయంత్రం చంపాపేటలోని మందా యాదవరెడ్డి గార్డెన్స్‌లో రిసెప్షన్ నిర్వహించారు. ఇందుకు అందరూ హాజరయ్యారు.
వేడుక పూర్తయిన తరువాత లాలాపేట వెళ్లేందుకు నూతన దంపతులు సాయినాథ్, సౌమ్యతో పాటు మదనాచారి, శాదర, పెళ్లి కూతురు చెల్లెలు హేమమాలిని (19) సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కారులో బయలుదేరారు. మధనాచారి కారు నడుపుతున్నాడు. నాగోలు చౌరస్తా రాగానే రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ హఠాత్పరిణామంతో కారులోని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మదనాచారి మృతిచెందాడు.
గాయపడ్డ వారు కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెళ్లి కుమార్తె సౌమ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. సాయినాథ్‌కు చేయి విరిగి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. శారద, హేమమాలిని తలకు, ఇతర భాగాల్లో గాయాలయ్యాయి. లారీ నడుస్తుందన్న భావనతో వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. రోడ్డును పొగమంచు కప్పేయటం ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఎల్‌బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications