నంద్యాల జిల్లాలో విషాదం.. ఇంటర్ ఫెయిల్ అయ్యాడని విద్యార్ధి ఆత్మహత్య
నేడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాలను ప్రకటించారు. అయితే ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడని మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న చిన్న మస్తాన్ అనే విద్యార్థి ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యాడు. దీంతో మనోవేదనకు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్ధి తండ్రి పెద్ద మస్తాన్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పిల్లాడి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

చదువు అనేది కేవలం గ్రేడ్‌షీట్లు, మార్కుల కోసం కాదు. అది మనకు ఆలోచించగల శక్తిని పెంచుకోవడానికి తెలివితేటలను, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపకరిస్తుంది. ఉద్యోగం కోసం మాత్రమే చదవడం కాకుండా.. జీవితాన్ని నిర్మించేందుకు దారిచూపే సాధనంగా దాన్ని ఉపయోగించుకోవాలి. చదువు లేకపోయినా జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అంతే కానీ ఒకసారి పరీక్ష ఫెయిలయినందుకు జీవితానికే చెక్ పెట్టాల్సిన అవసరం లేదు. జీవితమే ఒక పరీక్ష అయితే... ఒక్క ఫెయిలుర్‌తో మన రిజల్ట్ ఏం మారదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ఎప్పుడు ముందుకు సాగాలి. ఒక్కసారి ఫెయిల్ అయితే ఏం? మరోసారి ఎగజం రాయవచ్చు.. కానీ క్షణికావేశంలో జీవితాన్ని విడిస్తే అది కరెక్ట్ కాదని పలువురు ప్రముఖులు సైతం హితబోధ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications