ఘోర రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈ ప్రమాదంలో హంద్రీనీవా కెనాల్ (హెచ్‌ఎన్‌ఎస్) పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి (50) మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో బాధితులను అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతి చెందిన డిప్యూటీ కలెక్టర్ రమాదేవి అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు.

రమాదేవి స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. పీలేరు నుంచి రాయచోటిలోని కలెక్టరేట్ గ్రీవెన్స్ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications