బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తూర్పు గోదావరి: ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు..తప్పిన ప్రాణానష్టం: రైళ్ల రాకపోకలకు అంతరాయం

|
Google Oneindia TeluguNews

కాకినాడ: సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. రైలు ప్యాంట్రీ కార్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నడుస్తున్న రైలులో ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల గాలి వేగానికి మంటలు శరవేగంగా వ్యాపించాయి. ప్యాంట్రీ కార్ పూర్తిగా కాలిపోయింది. దీనికి ఆనుకుని ఉన్న మరో రెండు బోగీలకు కూడా మంటలు వ్యాపించాయి. దీనితో వాటిని స్టేషన్ లోనే వదిలి వేశారు. రైలును పంపించారు. బెంగళూరు-టాటానగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సోమవారం ఉదయం బెంగళూరులోని యశ్వంత్ పురా నుంచి ఉదయం 8:30 గంటలకు జార్ఖండ్ రాజధాని జంషెడ్ పూర్ కు బయలుదేరిన టాటానగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మంగళవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు స్టేషన్ సమీపంలో తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటలు చెలరేగింది ప్యాంట్రీ కార్ లో కావడంతో ఎలాంటి ప్రాణనష్టమూ సంభవించలేదు. ప్యాంట్రీ కార్ లో సిలిండర్ లీకేజీ వల్ల లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు.

Train From Bengaluru Catches Fire, Many Trains In Andhra Pradesh Delayed

మంటలు చెలరేగిన వెంటనే అందుబాటులో ఉన్న అగ్ని నిరోధక పరికరాలతో వాటిని నియంత్రించారు. అయినప్పటికీ.. ప్యాంట్రీ కారు సహా మంటలు వ్యాపించిన మరో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. రైలును సమీపంలోని గొల్లప్రోలు స్టేషన్ లో నిలిపివేశారు. రైల్వే భద్రతా బలగాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గురైన బోగీలను రైలు నుంచి వేరు చేసి, గమ్యస్థానం వైపు పంపించి వేశారు. ఈ ఘటనతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

English summary
A fire broke out in the pantry of a running train late at night in Andhra Pradesh's East Godavari district. The staff separated the pantry car, stopping the fire from spreading to the other bogies of the train. No injuries from the incident have been reported so far. The origin of the fire, which broke out at around 2 am, is not yet known. The pantry car of the train, the Yesvantpur-Tatanagar Superfast Express, was destroyed in the fire. Before separating the pantry, the train staff attempted to put out the fire, but were not successful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X