సినీ ఫక్కీలో రైలు దోపిడీ: విమానాశ్రయంలో గర్భస్రావం

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం నెలకొంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళకు ప్రమాదవశాత్తు గర్భస్రావం అయింది. విమానంలోనే ప్రసవం అవడంతో శిశువుమృతి చెందగా, మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటనే ఆమెను విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించారు.
భార్యను చంపిన భర్త
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ సమతానగర్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ భర్త కట్టుకున్న భార్యను హతమార్చాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయారు. నిందితుడు సస్సెండైన ఎస్‌ఐ భానుప్రసాద్‌గా తెలుస్తోంది.
మహిళ దారుణ హత్య
విజయవాడ నగరంలోని కృష్ణలంక హైస్కూల్ సమీపంలో 50 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. దుండుగులు మహిళ గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు.












Click it and Unblock the Notifications