ప్రశాశం జిల్లా:కుప్పకూలిన విద్యుత్ స్థంభాలు...రైళ్ల రాకపోకలకు అంతరాయం

ప్రకాశం జిల్లా:ఎపిలో రైల్వే శాఖకు సంబంధించి పెను ముప్పు తప్పింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆరు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రైళ్ల రాకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం వివరాల్లోకి వెళితే...

చెన్నై-విజయవాడ మార్గంలో గూడ్స్ ప్రయాణిస్తుండగా నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో దిగువమెట్ట-చెలమ రైల్వేస్టేషన్ల మధ్య ట్రాక్ పై ఒక చోట రైల్వే విద్యుత్ తీగలు కిందకి జారాయి. ఈ విషయాన్ని గమనించని గూడ్స్ డ్రైవర్ రైలును ముందుకు నడిపాడు. దీంతో ఈ తీగలు గూడ్స్ పై భాగానికి తగులుకొని ఆరు విద్యుత్ స్తంభాలు నేలను పెకలించుకొని ట్రాక్ కు ఇరువైపుల చెల్లా చెదురుగా పడ్డాయి. స్థానికుల అరుపులతో అప్రమప్తమైన గూడ్స్ డ్రైవర్ రైలు నిలిపివేశాడు.

Train services to the Bangalore to Vijayawada route

మరోవైపు ఈ ఘటన కారణంగా బెంగుళూరు-విజయవాడ రూట్ నడిచే పలు రైళ్లు నిలిచిపోయాయి. అయితే విద్యుతీకరణ పనుల్లో నాణ్యత లేకపోవడం కారణంగానే విద్యుత్ తీగలు ఇలా కిందకి జారినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణ చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+