గుంటూరు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ వారికి ముఖ్య గమనిక
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్ లో భద్రతా పరమైన పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే కొన్ని రైళ్లను పాక్షికంగా, మరికొన్నింటిని పూర్తిగా అధికారులు రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు రద్దైన రైళ్లు
కాకినాడ - విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్
విశాఖపట్నం - కాకినాడ ప్యాసింజర్ స్పెషల్
రాజమండ్రి - విశాఖపట్నం స్పెషల్ ప్యాసింజర్
విశాఖపట్నం - రాజమండ్రి స్పెషల్ ప్యాసింజర్
విశాఖపట్నం - విజయవాడ ఉదయ్ ఎక్స్ ప్రెస్
విజయవాడ - విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ ప్రెస్
విశాఖపట్నం - గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్ (15 నుంచి 21వ తేదీ వరకు)
గుంటూరు - విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ ప్రెస్

దారిమళ్లించిన రైళ్ల వివరాలు
ఆగస్టు 14, 15 తేదీల్లో ఎర్నాకుళం - పాట్నా ఎక్స్ ప్రెస్
ఆగస్టు 16, 18న ఎస్ వీఎం బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్
ఆగస్టు 13, 20 తేదీల్లో కోయంబత్తూరు - సిల్చార్ ఎక్స్ ప్రెస్
ఈ మూడింటిని దారి మళ్లించారు.
విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మార్గంలో కాకుండా విజయవాడ, ఏలూరు, నిడదవోలు మార్గంలో నడుస్తాయి.
ఎక్స్ ప్రెస్ రైళ్లల్లోని జనరల్ బోగీల్లో ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే తక్కువ ఖర్చుతో భోజనాన్ని అందించే పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రేణిగుంట, గుంతకల్లు, విజయవాడ, సికింద్రాబాద్ స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి ఇతర స్టేషన్లలో కూడా అమలు చేయనున్నారు. రూ.20కే పూరీ, కూర.. రూ.50కే పూరీ, కూరతోపాటు రైస్ కూడా అందించనున్నారు.












Click it and Unblock the Notifications