రైల్వే అలెర్ట్.. ఏపీలో ఆ రైళ్ళు రద్దు.. కొన్ని దారిమళ్లింపు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడనం మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించడంతో, ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక
గత 24 గంటల్లో విశాఖపట్నంలో కుండపోతగా వర్షం కురిసింది. కాపులుప్పాడులో 15.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. వాతావరణ శాఖ అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా, ఏలూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. శ్రీకాకుళం, మన్యం, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.

విశాఖపట్నం కిరండోల్ నైట్ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు
ఇక ప్రస్తుత వాయుగుండం నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే అలర్ట్ అయింది. కేకే లైన్లో పలు రైళ్లను దారి మళ్లించి మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అరకుకు వెళ్లే పర్యాటక రైలును నేడు, రేపు రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దారి మళ్లించిన రైళ్ల వివరాలలోకి వెళితే విశాఖపట్నం కిరండోల్ నైట్ ఎక్స్ప్రెస్ దారి మళ్ళిస్తున్నారు.
అరకు నుండి విశాఖ కిరండోల్ ఎక్స్ప్రెస్ రైలు వెనక్కు
అలాగే ఇప్పటికే అరకుకు వెళ్ళిన విశాఖ కిరండోల్ ఎక్స్ప్రెస్ రైలును కూడా అధికారులు వెనక్కి రప్పిస్తున్నారు. ముఖ్యంగా రైల్వే శాఖ భారీ వర్షాలతో సిబ్బందికి అటు ప్రయాణికులకు కూడా అలర్ట్ చేస్తుంది. ఎప్పటికప్పుడు రైళ్లు రద్దయిన, దారి మళ్లించిన సమాచారాన్ని అందించడంతో పాటు, సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తూ వర్షాలు పడుతున్న ప్రాంతాలలో, ముఖ్యంగా నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలలో రైళ్ల వేగాలను తగ్గించాలని అలర్ట్ చేసింది.












Click it and Unblock the Notifications