గుంటూరు, విజయవాడ ప్రజలకు ప్రధాన గమనిక
విజయవాడ రైల్వే డివిజన్ పరిదిలోని ట్రాక్ మరమ్మతుల కారణంగా అధికారులు కొన్ని రైళ్లను రద్దుచేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. అందులో ఎనిమిది రైళ్లను విజయవాడ - రామవరప్పాడు మధ్యలో రద్దు చేయగా.. కొన్ని రైళ్లను ఏలూరు- తాడేపల్లిగూడెం మార్గంలో రద్దుచేశారు. వీటిని నిడదవోలు జంక్షన్, భీమవరం టౌన్, గుడివాడ మీదుగా విజయవాడ వెళ్లేలా దారి మళ్లించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి
నెంబర్ 17243 గుంటూరు-రాయగడ 20 నుంచి 26 వరకు..
17244 రాయగడ-గుంటూరు రైలును 21 నుంచి 27 వరకు రద్దు చేశారు.
22702 విజయవాడ-విశాఖ 20, 21, 22, 24 25 తేదీల్లో..
22701 విశాఖ-విజయవాడ 20, 21, 22, 24, 25 తేదీల్లో రద్దయ్యాయి.
17239 గుంటూరు-విశాఖ 20 నుంచి 26 వరకు..
17240 విశాఖ-గుంటూరు 21 నుంచి 27 వరకు రద్దు చేశారు.

విజయవాడ-ఏలూరు-తాడేపల్లిగూడెం-నిడదవోలు మీదుగా వెళ్లే రైళ్లను విజయవాడ-గుడివాడ-భీమవరం-తణుకు-నిడదవోలు మీదుగా మళ్లించారు. ఈ నెల 25న 12756 భావనగర్- కాకినాడ పోర్టు.. 12509 బెంగళూరు - గౌహతి 22, 25 తేదీల్లో దారి మళ్లించారు. 11019 ఛత్రపతి టెర్మినల్ - భువనేశ్వర్ 20, 22, 24 తేదీల్లోను.. 13351 ధన్‌బాగ్-అల్లాఫస్ 20 నుంచి 26 వరకు మళ్లించారు. 18637 అట్టాయ్-బెంగళూరు 25 వరకు.. 12835 అట్టాయ్-బెంగళూరు 21, 26 తేదీల్లోను దారి మళ్లించారు. 12889 టాటా-బెంగళూరు 24న.. 18111 టాటా-యశ్వంత్‌పూర్ 23న.. 12376 జసిద్ - తాంబ్రం 22న మళ్లించారు.
రాజమండ్రి - విశాఖపట్నం మధ్య ట్రాక్ పనులు కారణంగా మచిలీపట్నం - భీమవరం - విశాఖపట్నం మధ్య నడిచే లింకు ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 25 వరకు రద్దు చేశారు. విశాఖ నుంచి భీమవరం మీదుగా మచిలీపట్నం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను 26 వరకు నిలిపివేశారు. ప్రయాణికులు ఈ మార్పుల్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications