విశాఖపట్నం, విజయనగరం జిల్లాల ప్రజలకు ముఖ్య గమనిక
విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలో రాయగడ-విజయనగరం మధ్య భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో కొన్ని రైళ్లను దారి మళ్లించడంతోపాటు మరికొన్నింటిని రద్దు చేశారు. అలాగే కొన్ని రైళ్లను కనీసం ఒక గంట సమయం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 19న విశాఖ-రాయగడ(08504),
20న రాయగడ-విశాఖ(08503),
విశాఖ-కొరాపుట్-విశాఖ(08546-08545),
విశాఖ-కొరాపుట్(18512),
21న కొరాపుట్-విశాఖ(18511) రైళ్లను రద్దు చేశారు.

ఈ నెల 19న ఎర్నాకుళం-టాటా(18190) ఎక్స్‌ప్రెస్‌ను మార్గమధ్యంలో రెండు గంటలు నిలిపివేస్తున్నారు. అలాగే అలప్పూజా-ధన్‌బాద్(13352) బొకారో ఎక్స్‌ప్రెస్ ను గంట సమయం నిలిపివేస్తున్నారు. ఖుర్ధా రోడ్ డివిజన్ కిషన్‌గంజ్-నెరగుండి స్టేషన్ల మధ్య ఆర్‌వోబీ పనులు జరుగుతుండటంతో ఈనెల 16న హౌరా-సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమాను రెండున్నర గంటల సమయం, 15న ఎస్‌ఎంవీ బెంగళూరు-హౌరా (12864) మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరతాయన్నారు. గుంతకల్ డివిజన్‌లో భద్రతా పరమైన పనుల కారణంగా ఈ నెల 18న యశ్వంత్‌పూర్-పూరీ(22884) ఎక్స్‌ప్రెస్ గుత్తి ఫోర్ట్, ఎర్రగుంట్ల మీదగా దారి మళ్లించారు. ఆ రోజు డోన్ హాల్ట్‌ను రద్దు చేస్తున్నారు. ప్రయాణికులు రైల్వేకు సహకరించాలని అధికారులు కోరారు.
ఒడిసాలోని బాలసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రైల్వే డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు. ఈ పనులు జరుగుతుండటంవల్ల కొన్నింటిని రద్దుచేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నారు.












Click it and Unblock the Notifications