గుంటూరు, విజయవాడ ప్రజలకు ముఖ్య గమనిక
భద్రతాపరమైన పనులు చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. పనులు పూర్తికావడంతో వాటిని పునరుద్ధరించారు. విజయవాడ-గుంటూరు (07783), గుంటూరు-మాచర్ల (07779), మాచర్ల-నడికుడి (07580), నడికుడి-మాచర్ల (07579), మాచర్ల-గుంటూరు (07780), గుంటూరు-విజయవాడ(07788) రైళ్లను తిరిగి ప్రవేశపెడుతున్నారు.
ఒడిసాలో బాలసోర్ వద్ద కోరమాండల్ ప్రమాదానికి గురై దాదాపు 300కు పైగా ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను రైల్వే ఆధునికీకరిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని జోన్లు, డివిజన్ల పరిధిలో పనులు జరుగుతున్న సమయంలో కొన్ని రైళ్లను రద్దుచేయడం, మరికొన్నింటిని దారి మళ్లించి తిప్పడం లాంటివి చేస్తున్నారు

దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటిల్లో భాగంగా ఈ నెల 26న నాందేడ్-పానిపట్ (07635) రైలు ఉదయం 5.40 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి.. తర్వాతరోజు మధ్యాహ్నం 1.15 గంటలకు పానిపట్ చేరుకుంటుంది. ఈ రైలు (07636) తిరుగు ప్రయాణంలో ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3.15 గంటలకు పానిపట్‌లో బయలుదేరి.. తర్వాతరోజు రాత్రి 7.30 గంటలకు నాందేడ్ చేరుతుంది. ఈ రైలు నాందేడ్ తోపాటు పూర్ణ, పర్బణి, జాల్నా, ఔరంగాబాద్, మన్మాడ్, భుసావల్, ఖాండ్వా, ఇటార్సీ, ఝాన్సీ, ఆగ్రా, న్యూఢిల్లీ స్టేషన్లలో ఆగుతుంది.
అక్టోబరులో రైల్వే తన సమయ పాలనను మారుస్తూ ఉంటుంది. రైల్వేస్టేషన్లలో, రిజర్వేషన్ కేంద్రాల్లో దేశవ్యాప్తంగా రైళ్లకు సంబంధించిన టైంటేబుల్ పుస్తకాలను విక్రయానికి ఉంచారు. ఆయా జోన్లలో, డివిజన్ల పరిధిలో తిరుగుతున్న అన్ని రైళ్లకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది.












Click it and Unblock the Notifications