ర్యాష్ డ్రైవింగ్ వల్లే, అందుకే ఇలా చేశారు: కమిషనర్ బాలసుబ్రమణ్యం

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ:టీడీపీ నాయకులు కేశినేని నాని రవాణ శాఖ అధికారులపై దౌర్జన్యం చేసిన ఘటనపై రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం స్పందించారు.

ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కింద పడి ఓ మనిషి చనిపోయారని, దీనిపై పోలీసులు తమను వివరాలు కోరారని ఆయన చెప్పారు.డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రవాణశాఖ అధికారులు నివేదిక ఇచ్చారని చెప్పారు.

వాహనంలో మెకానికల్ డిఫెక్ట్ లేదని రాసిచ్చారని చెప్పారు.పోలీసులు మళ్ళీ జన్యునిటీ సర్టిఫికెట్ కావాలని కోరితే అదికూడ ఇచ్చామన్నారు. ఈ విషయమై టిడిపి నాయకులకు అర్థం కాలేదని రవాణ శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం చెప్పారు.

balasubramanyam

తాము నిబంధనల ప్రకారంగానే పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి ఇతర అధికారులు తనతో మాట్లాడారని బాలసుబ్రమణ్యం చెప్పారు.

ఈ తరహ ఘటనలను పునరావృతం కానివ్వబోమని ప్రభుత్వం హమీ ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు.మరో వైపు ప్రజా ప్రతినిధులు వ్యవహరించిన తీరుపట్ల రవాణా శాఖ అధికారులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారని ఆయన చెప్పారు.అయితే ఈ ఘటనపై ప్రజా ప్రతినిధులు ఆదివారం నాడు తనను కలిశారని ఆయన చెప్పారు.వారంతా వచ్చిన క్షమాపణలు కోరారని ఆయన చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
transport commissioner balasubramanyam response on vijayawada incident.government assured to me didn't allow this type of incidents in future.
Please Wait while comments are loading...