ప్రైవేటు ట్రావెల్స్ పై సోదాలు - ఈ నెంబర్ కు కాల్ చేయండి : అధిక ధరల వసూళ్లతో..!!
పండుగ సీజన్ కావటంతో ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. పలు రూట్లలో ముందుగానే రిజర్వేషన్లు సైతం పూర్తి చేసాయి. సాధారణ రైళ్లు..బస్సులు అందుబాటులో లేకపోవటంతో పలువురు ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇక వైపు ఏపీఎస్ఆర్జీసీ సైతం పండుగ రద్దీ తట్టుకొనేందుకు అదనపు బస్సులను నడుపుతోంది. అదే సమయంలో అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. ఇక, రైళ్లల్లో మూడు నెలల ముందుగానే సీట్లు రిజర్వ్ అయిపోయాయి. దీంతో..ప్రైవేటు ట్రావెల్స్ కు డిమాండ్ పెరిగింది.
పండుగ సమయంలో భారీగా ఛార్జీలు వసూలు చేస్తన్నారనే ఫిర్యాదులతో రవాణా శాఖ అధికా రులు రంగంలోకి దిగారు. అధిక రేట్లు వసూలు చేసినా, నిబంధనల ప్రకారం లేకపోయినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్ని నాని ఆదేశించడంతో ఏపీ రవాణా శాఖకమిషనర్ పి.ఎస్.ర్. ఆంజనేయులు నేతృత్వలో దాడులు చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నాయి. కాంట్రాక్టు, క్యారేజి, ప్రైవేటు వాహనాలపై రవాణా శాఖ చెక్ చేస్తున్నారు. ట్యాక్సు, పర్మిట్, ఫిట్నెస్ లేని వాహనాలు, అధిక రేట్ల వసూళ్లపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ప్రైవేటు బస్సులు ఏవైనా కంప్లైంట్లు ఇవ్వదలచిన వారు 9154294722 కు సమాచారం ఇవ్వాలన్న రవాణాశాఖ సూచించింది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించకుండా మోటార్ వాహనాల చట్టాలకు లోబడి వాహనాలను నడపాలని రవాణాశాఖ అధికారలు పేర్కొన్నారు. ప్రధానంగా విజయవాడ - విశాఖ రూట్ అదే విధంగా విజయవాడ - తిరుపతి రూట్ లో పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. బస్సుల కండీషన్ ఎలా ఉందనే దాని పైన అధికారులు ఫోకస్ పెట్టారు. ఇక, పండుగ ముగిసిన తరువాత రిటర్న్ జర్నీలకు రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.












Click it and Unblock the Notifications