నెల్లూరులో భూ ప్రకంపనలు: జనం పరుగులు, రాత్రంతా జాగారం
నెల్లూరు: జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బోగోలు మండలంలో రెండు సెకన్ల నుంచి మూడు సెకన్లపాటు భూమి కంపించింది.
ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
వెంటనే నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. మళ్లీ భూకంపం వస్తుందేమోనని వారంతా రాత్రి మొత్తం జాగారం చేశారు.

కాగా, నెల్లూరు ప్రాంతం భూకంపం జోన్‌లో ఉందన్న విషయం తెలిసిందే. ఇక్కడ తరచూ భూ ప్రకంపనలు నమోదవుతుండటంతో, ఎప్పుడు పెద్ద భూకంపం వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications