వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ ఎఫెక్ట్: ఇళ్లలో నుండి జనం పరుగు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను భూప్రకంపనలు వచ్చాయి. కోస్తా ప్రాంతం వణికింది. అపార్టుమెంటువాసులు భయాందోళనకు గురయ్యారు. జనాలు వీధుల్లోకి పరుగులు తీశారు. నేపాల్ భూకంపం ప్రభావం భారత దేశంలోని పలు రాష్ట్రాల పైన పడింది.

ఏపీలో శ్రీకాకుళం, పోలాకి, రణస్థలం, నరసన్నపేట, కొవ్వాడ, పలాస, విశాఖ, తుని, అనకాపుల్లి, భీమిలి, కాకినాడ, రాజమండ్రి, రావులపాలెం, అమలాపురం, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, ముమ్మిడివరం, భీమవరం, ఆకివీడు, ఏలూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది.

శ్రీకాకుళం మొదలు కృష్ణా వరకు పలు కోస్తా జిల్లాల్లో శనివారం ఉదయం 11.45 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. 10 నుంచి 20 సెకండ్లపాటు ప్రకంపనలు సంభవించాయి. ఉభయగోదావరి జిల్లాలో భూప్రకంపనలతో ప్రజలు బెంబేలెత్తారు.

 ఏపీలో ప్రకంపనలు

ఏపీలో ప్రకంపనలు

పలు ప్రాంతాల్లో ఆపార్ట్‌మెంట్ జనం బయటకు పరుగులుదీశారు. కాకినాడ కలెక్టరేట్‌ ఉద్యోగులూ కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు.

ఏపీలో ప్రకంపనలు

ఏపీలో ప్రకంపనలు


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అపార్ట్‌మెంట్‌ వాసులు భయంతో రోడ్లపైకి వచ్చారు. పెరవలి మండలం తీపర్రులో రామాలయంలో కిటికీ అద్దాలు పగిలిపోయాయి.

ఏపీలో ప్రకంపనలు

ఏపీలో ప్రకంపనలు

కృష్ణా జిల్లా గుడివాడ సత్యనారాయణపురంలో ఓ భవనం బీటలు ఇచ్చింది. ఊయ్యూరు బస్టాండ్‌లో సిమెంటు బల్లలు కదలాయి.

ఏపీలో ప్రకంపనలు

ఏపీలో ప్రకంపనలు


విజయనగరం జిల్లా సాలూరు తదితర ప్రాంతాల్లో భూమి కొద్ది సెకన్లపాటు కంపించింది. శ్రీకాకుళం జిల్లాలోను పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

ఏపీలో ప్రకంపనలు

ఏపీలో ప్రకంపనలు

విశాఖపట్నంలో అక్కయ్యపాలెం, మధురవాడ తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

English summary
Tremors felt in Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X