అనంతపురం జిల్లాలో భూప్రకంపనలు: పరుగులు తీసిన జనం
అనంతపురం: జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. బెళుగుప్ప మండలంలోని పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. జీడిపల్లి జలాశయం పరిసరాల్లో భూమి కంపించింది. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు తీశారు.

భూ ప్రకంపనలతో ఇళ్లలోని వస్తువులు కిందపడ్డాయి. భూ ప్రకంపనల తీవ్రతకు కొన్నిగ్రామాల్లో సీసీ రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. తొమ్మిది సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు.
అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం కాలంలో భూమి కంపించడం రెండవ సారి అని గ్రామస్తులు తెలిపారు. ఈ భూ ప్రకంపనల్లో ప్రాణా, ఆస్తి నష్టం జరుగలేదు. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భూ ప్రకంపనలపై అధికారులు ఆరా తీశారు.












Click it and Unblock the Notifications