రేపు, ఎల్లుండి తిరుమలలో ట్రయల్ రన్ నిలిపివేత

తిరుమల క్షేత్ర మహత్యాన్ని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్రను భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ కు తాత్కాలకంగా బ్రేక్ పడింది. అత్యాధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ మ్యూజియం ట్రయల్ రన్ ను మెయింటెనెన్స్ పనుల కోసం నిలిపివేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు పూర్తిస్థాయిలో దీనిని ప్రారంభించడానికి ముందుగా ఈ ట్రయల్ రన్ చేపట్టింది టీటీడీ. ఈ సమయంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియం సందర్శనకు అనుమతి ఇస్తోన్నారు. టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, తిరుమల, తిరుపతికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక మీడియా ప్రతినిధులు, వారి కుటుంబాలు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తోన్నారు.

Trial run of the Sri Venkateswara Museum in Tirumala will remain suspended on November 8 and 9

అలాగే.. శ్రీవారి సేవకులు, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలతో పాటు ఇతర పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ ట్రయల్ రన్ ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఇది పూర్తయిన అనంతరం 16వ తేదీ నుండి భక్తులను మ్యూజియం సందర్శనకు అనుమతిస్తారు. ఈ మ్యూజియం ఎంట్రీ ఫీజు 50 రూపాయలుగా నిర్ధారించారు.

దీపావళికి తీపికబురు ఇచ్చిన సీఎం విజయ్
దీపావళికి తీపికబురు ఇచ్చిన సీఎం విజయ్

ఈ నేపథ్యంలో మెయింటెనెన్స్ పనుల కోసం ఈ నెల 8, 9 తేదీల్లో ఈ ట్రయల్ రన్ నిలిపివేసినట్లు టీటీడీ తెలిపింది. తిరిగి 10వ తేదీన యధాతథంగా దీన్ని పునరుద్ధరిస్తామని వివరించింది. 15వ తేదీ వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు, పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, శ్రీవారి సేవకులకు ఉచితంగా మ్యూజియం సందర్శనకు అనుమతిస్తామని పేర్కొంది. 16వ తేదీ నుండి ఎస్వీ మ్యూజియాన్ని భక్తుల కోసం అందుబాటులోకి తీసుకుని రానున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు- జడ్జిమెంట్
ప్రభుత్వ ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు- జడ్జిమెంట్

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ ఎస్వీ మ్యూజియంలో స్వామివారి నిత్య సేవలు, ఉత్సవాల ప్రాశస్త్యాన్ని తెలిపే అరుదైన ఛాయాచిత్రాలు, ప్రాచీన ఆభరణాల నమూనాలు, చారిత్రక నాణేలు, రాగిరేకులు, రాతి శిల్పాలను ప్రదర్శనకు ఉంచారు. భక్తులకు నూతన తరహా ఆధ్యాత్మిక అనుభూతిని పంచేందుకు వర్చువల్ రియాలిటీ సాంకేతికత, 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఇంటరాక్టివ్ కియోస్క్‌, డిజిటల్ స్క్రీన్లను అందుబాటులోకి తెనున్నారు.. ఈ మ్యూజియం ద్వారా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+