ఆలస్యంగా వచ్చారని మోకాళ్లపై నడిపించారు

విజయనగరం: సంక్రాంతి సెలవులకు వెళ్లి ఆలస్యంగా వచ్చారని ఓ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినులకు తీవ్ర శిక్షను విధించారు. పాఠశాల మైదానం చుట్టూ ఆరు రౌండ్లు మోకాళ్లపై విద్యార్థినులను నడిపించారు. దీంతో వారి మోకాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. రక్త కారుతున్నా కూడా ఉపాధ్యాయులు వారిపై కనికరం చూపలేదు.

ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా గురులక్ష్మీ మండలం ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. సంక్రాంతి పండగ సెలవులకు వెళ్లి ఆలస్యంగా రావడంతో ఉపాధ్యాయులు ఈ శిక్షను విధించారు. ఆలస్యంగా వచ్చినందుకు జరిమానా చెల్లించాలి లేదా మైదానం చుట్టూ ఆరు రౌండ్లు మోకాళ్లపై నడవాలని ఉపాధ్యాయులు ఆదేశించడంతో విద్యార్థినులు చేసేదేమి లేక మోకాళ్లపై నడిచారు.

tribal students walked knees in a school

విద్యార్థినులకు కర్తం కారుతున్నా ఆ ఉపాధ్యాయులు కనికరించకపోవడం విచారకరం. దీంతో ఆ విద్యార్థినుల మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ పార్వతీపురంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఓ విద్యార్థినికి తీవ్ర జ్వరంతో రావడంతో ఆమెకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఘటనపై స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలను ఇంత దారుణంగా శిక్షించడం సరికాదని అన్నారు.

కాగా, ఘటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి రావెల కిశోర్.. బాధ్యులైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ అధికారులను ఆదేశించారు. ఘటనపై నివేదిక అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎరచందనం దుంగలను అధికారులు పట్టుకున్నారు. రూ. 2కోట్ల విలువైన 1.5 టన్నుల ఎర్రచందనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి దేవస్థానానికి సమీపంలోని గుర్రాలబావి వద్ద ఈ దుంగలను పట్టుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో పదిమంది పరారయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+