చంద్రబాబును చూస్తే సంతోషంగా ఉంది, ఈ వయసులో కూడా, చినజియ్యర్ స్వామి

కృష్ణానది ప్రవాహానికి అడ్డుగా ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి భద్రాచలం తరహాలో గట్లను పటిష్టం చెయ్యాలని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. కృష్ణమ్మ ఉగ్రరూపం వీడనాడాలని కాంక్షిస్తూ గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగరంలో త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి, అహోబిల జీయర్ స్వామి కృష్ణమ్మకు సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఓ యువకుడిలా కష్టపడి పని చేస్తూ వరద బాధితులను ఆదుకోవడానికి శ్రమిస్తున్నారని కొనియాడారు. విశాఖలో గతంలో హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు ఆయన అక్కడే ఉంటూ విశాఖపట్నంను పూర్వ స్థితికి తీసుకొచ్చారని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి గుర్తు చేశారు.

Tridandi Srimannarayana Chinnajiyar Swamy who said Chandrababu is working like a young man

ఇప్పుడు విజయవాడను కూడా పూర్వస్థితి తీసుకురావడానికి సీఎం చంద్రబాబు నాయుడు శక్తివంచన లేకుండా పని చేస్తారనే నమ్మకం ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా అర్ధరాత్రి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలా ఓపికగా సంచరిస్తూ వరదబాధితులను ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి అన్నారు.

వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలు త్వరలో తీరిపోవాలని ఆదేవుడిని తాను ప్రార్థిస్తున్నానని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇంకా శక్తి వంచన లేకుండా పనిచేయడానికి ఆ దేవుడు ఆయనకు శక్తిని ప్రసాదించాలని ఆదేవుడిని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి అన్నారు.

విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ప్ర భుత్వం, అధికారులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామీజీ అన్నారు. ప్రజలు కూడా త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ కృష్ణమ్మ శాంతించాలని తాము ఆ భగవంతుడికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నామని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామీజీ చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రజలు కూడా సహకరించాలని, వారికి చేతనైన సహాయం చేయాలని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామీజీ ఆంధ్రప్రదేశ్ లోని ఇతర జిల్లాల ప్రజలకు మనవి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+