మహిళా కమిషన్ చైర్మన్ సంచలన వ్యాఖ్య, అక్కాచెల్లెళ్ల హత్యపై...
హైదరాబాద్: మహిళల విషయంలో న్యాయస్థానాలు వెల్లడించే తీర్పులపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళల విషయంలో వెల్లడించే తీర్పులు సరిగా లేవని ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహిళల కేసులను కోర్టుల్లో త్వరగా విచారణ పూర్తి చేసి, నేరస్థులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. యువతులు, మహిళలు తమ సమస్యలతో పోలీసు స్టేషన్‌కు వస్తే చిన్నచూపు చూడవద్దని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ప్రేమ పేరుతో యామిని, శ్రీలేఖను చంపిన అమిత్ సింగ్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు. అమ్మాయిలు వేధిస్తున్నారని తెలిస్తే తల్లిదండ్రులు వెంటనే పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదంట మహిళా కమిషన్‌ను సంప్రదించాలన్నారు.












Click it and Unblock the Notifications