పూజా హెగ్డే లేకుండా త్రివిక్రమ్ సినిమాలు తీయడా?
పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దర్శకుడు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్రలు పోషించారు. ఈనెల 28వ తేదీన బ్రో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు, హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? సంబంధం ఉంది..

బ్రో సినిమా టీజర్ విషయంలో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక్కడ విశేషమేమిటంటే.. సినిమాతో సంబంధం లేని పూజా హెగ్డేపై ట్రోలింగ్ జరగడం. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు సమకూర్చారు. ఈ సినిమా టీజర్ ప్రారంభంలో ఓ కమర్షియల్ యాడ్ వస్తోంది. సౌత్ ఇండియా షాపింగ మాల్ వారిది ఈ యాడ్ ఇది మూడు సెకన్లు ప్రసారమైన తర్వాత టీజర్ స్టార్ట్ అవుతోంది. ప్రస్తుతం ఈ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పూజా హెగ్డే ఉన్నారు.

పూజా యాడ్ కోసమే టీజర్‌ను ఆలస్యంగా రిలీజ్ చేశారంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఆమెను బ్రో టీజర్ లో పెట్టడానికే గుంటూరు కారం నుంచి తీసేశావంటూ త్రివిక్రమ్ పై జోకులు పేలుతున్నాయి. సోషల్ మీడియా అంతా త్రివిక్రమ్ శ్రీనివాస్-పూజా హెగ్డేపైనే చర్చ నడుస్తోంది. 'పూజా హెగ్డే లేకుండా సినిమాలు తీయరా?', 'చిన్న సన్నివేశంలోనైనా పూజా హెగ్డే ఉండాల్సిందేనా', 'త్రివిక్రమ్‌కు పూజా లక్కీ హీరోయిన్', 'త్రివిక్రమ్‌కు అదో సెంటిమెంట్' అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో అల వైకుంఠపురం, అరవింద సమేత చిత్రాలు వచ్చి భారీ హిట్స్ కొట్టాయి. గుంటూరు కారం షూటింగ్ ఆలస్యమవుతుండటంతో పూజా హెగ్డే డేట్లు సర్దుబాటు చేయడం కుదరలేదు. దీంతో పూజాను తప్పించి మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.












Click it and Unblock the Notifications