వారిని చూసి నేర్చుకో... జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోలింగ్!
నందమూరి తారక రామారావు మనవడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ అంచలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. హీరో అన్న తర్వాత అభిమానులుంటారు.. ట్రోలర్స్ కూడా ఉంటారు. జూనియర్ విషయంలో కూడా అంతే. ఎంతమంది అభిమానులున్నారో ట్రోలర్స్ కూడా అదే సంఖ్యలో ఉన్నారు.
మొదటినుంచి జూనియర్ అంటే గిట్టనివారు సోషల్ మీడియాలో తామరతుంపరులుగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ వేడుకల సమయంలో కూడా ట్రోలింగ్ చేశారు. తాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల విషయంలో జూనియర్ పై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. తారకరత్న మృతిచెందిన సమయంలో కూడా ట్రోలింగ్ జరిగింది. ఈనెల 28వ తేదీన ఎన్టీఆర్ శతజయంతి కావడంతో వారంరోజుల ముందునుంచే ఈ వేడుకలను వైభవంగా ప్రారంభించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలకు రాజకీయ రంగంతోపాటు సినీ రంగంలోని ప్రముఖులంతా హాజరయ్యారు.

వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ రాలేదని ట్రోలింగ్ జరుగుతోంది. రామ్ చరణ్, సిద్ధు జొన్నలగడ్డ, నాగచైతన్య తదితర కుర్ర హీరోలంతా హాజరైనప్పటికీ జూనియర్ రాకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వారిని చూసి నేర్చుకోవాలంటూ సలహాలిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నట్లు జూనియర్ ప్రకటించారు. అయితే ఎప్పుడైతే జూనియర్ ఇన్విటేషన్ ఇచ్చారో ఆరోజు పుట్టినరోజు కాబట్టి రాలేనని ముందే చెప్పాల్సింది కదా అంటున్నారు.
వాస్తవానికి ఆరోజు తాను రాలేనని ముందే చెప్పాడని, అయితే ఈ వేడుకకు ప్రమోషన్స్ కోసం శ్రేయాస్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని అర్థం చేసుకోలేని ట్రోలర్స్ ఇంకా జూనియర్ పై పదే పదే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కావాలనే ఎన్టీఆర్ పై నెగెటివిటీని వ్యాపింప చేస్తున్నారని తారక్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తారక్ అసలు ఏం తప్పు చేశాడని, అతనిపై ఎందుకు అంత వ్యతిరేకత అని ప్రశ్నిస్తున్నారు. ట్రోలింగ్ ఆపాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications