• search
 • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మా మంత్రి చెప్పేదొకటి .. చేసేదొకటి.. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పై నెటిజన్ల ట్రోల్స్

|

ఏపీలో మంత్రులు , అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా లాక్ డౌన్ సమయంలో చేసే పనులు, చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇక తాజా పరిణామాల నేపధ్యంలో ఎవరు ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాల్సిన పరిస్థితి . అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడితే సోషల్ మీడియా మాత్రం రచ్చ రచ్చ చేసేస్తుంది. ఇది ఏపీ మంత్రులకు , అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది.

వికలాంగ బిచ్చగత్తె ఔదార్యం..కరోనా సమయంలో లాక్ డౌన్ సిబ్బందికి అరటిపండ్లు , మజ్జిగ పంపిణీ

 ఫోటోలకు ఫోజులా .. పబ్లిసిటీకి దూరంగా ఉన్నానని చెప్పిన మంత్రి అనీల్

ఫోటోలకు ఫోజులా .. పబ్లిసిటీకి దూరంగా ఉన్నానని చెప్పిన మంత్రి అనీల్

కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అయ్యాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంటే కరోనాతో పోరాటానికి ప్రభుత్వానికి, ఇళ్లకే పరిమితమైన సామాన్యులకు సాయమందించేందుకు ఆపన్న హస్తాలు ముందుకు వస్తున్నాయి. ఈక్రమంలో సహాయం చేసే వారు ఫోటోలకు ఫోజుల కోసం సహాయం చెయ్యకండి అని , తాను మంత్రి హోదాలో అలాంటి పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నానని చెప్పారు మంత్రివర్యులు అనీల్ కుమార్ యాదవ్.

 టీడీపీ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తుందని మండిపడిన మంత్రి

టీడీపీ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తుందని మండిపడిన మంత్రి

ఎవరైనా సహాయం చెయ్యాలనుకుంటే తహసీల్దార్ కార్యాలయాల్లో , గ్రామ సచివాలయాల్లో నిత్యావసరాలు అందిస్తే వాటిని వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పటం ప్రతిపక్ష పార్టీల నాయకుల ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇక దీనిపై మాట్లాడిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ముఖ్యంగా టీడీపీ నేతలు అలాంటి చౌకబారు పనులు చేస్తున్నారని విమర్శించారు . చేసే సాయం తక్కువ పబ్లిసిటీ స్టంట్ అని మందిపాదరు. తాము అలాంటి పనులు చెయ్యమని చెప్పుకున్నారు . ఇక ఆయన అలా చెప్పారో లేదో మర్నాడే అనీల్ కుమార్ యాదవ్ సహాయం అందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

 ఫోటోలు వద్దని చెప్పి ఫోటోలకు ఫోజులిచ్చిన మంత్రిపై నెటిజన్లు ట్రోల్స్

ఫోటోలు వద్దని చెప్పి ఫోటోలకు ఫోజులిచ్చిన మంత్రిపై నెటిజన్లు ట్రోల్స్

ఇక ఆయన చెప్పింది విన్న, ఆ ఆతర్వాత చేసింది చూసిన నెటిజన్లు మా మంత్రి చెప్పేది ఒకటి , చేసేది ఒకటి అంటూ మాట్లాడుతున్నారు. ఇంకొందరైతే మా నెల్లూరు జిల్లా డాక్టర్ జులాయి సినిమాలో బ్రహ్మానందం టైపు .. ఏం చేసినా ఇట్టే దొరికిపోతారు అంటూ సెటైర్లు వేస్తున్నారు . కరోనా విపత్కర పరిస్థితుల్లో సాయమందించే వారు ఫోటోలకు దూరంగా ఉండాలని తాను వాటి జోలికి పోవడం లేదని సోమవారం అందరికీ హితవు పలికిన అనిల్ తర్వాతి రోజే ఫొటోలు దిగటంతో ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 చెప్పిందేంటి చేసిందేంటి మంత్రి వర్యా అని ప్రశ్నలు

చెప్పిందేంటి చేసిందేంటి మంత్రి వర్యా అని ప్రశ్నలు

సోమవారం మీడియాతో మాట్లాడిన అనిల్ యాదవ్.. టీడీపీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.టీడీపీ నేతలు సహాయం చేసి తక్కువ , ఫోటోలకు ఫోజులు ఇచ్చేది ఎక్కువని వ్యాఖ్యానించారు . ఎక్కడా తాను ఫొటోలు తీయించుకోలేదని, తాను పబ్లిసిటీ చేయించుకోలేదన్నారు. ఏదైనా సహాయం చేసేది ఉంటే వాలంటీర్లు, సెక్రటరీ ద్వారా చేయిస్తున్నామన్నారు. సొంత పార్టీ నేతలకు కూడా ఇదే విషయం చెప్పామని చెప్పిన మంత్రి అడ్డంగా దొరికిపోయారు. అయితే తర్వాతి రోజే అనిల్ ఫోటోలు దిగుతూ కనిపించారు. ఎవరూ సహాయం చేసి ఫోటోలు తీయించుకోవద్దంటూ తమరు చేసిందేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అందరికీ వర్తించే రూల్స్ వైసీపీ నేతలకు ,మంత్రులకు వర్తించవని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు .

  Tested Negative People And States Situation After ICMR Advises Not to Use Rapid Testing Kits

  English summary
  State irrigation Minister Anil Kumar Yadav has been trolling is social media . in a press meet, he said that TDP leaders doing service little and they are focusing on publicity. they are taking photos of their services. but as a minister, he is not interested to do publicity about his services. On the next day of this announcement, he has taken photos of his help to the poor people. so, this issue viral in social media and he is being trolled.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X