చంద్రబాబుకు తలనొప్పి: పయ్యావులతో ఎర్రబెల్లి ఢీ

 Trouble to Chandrababu: Fight between Errabelli and Payyavula
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తీవ్రమైన విమర్శల దాడిని ఎదుర్కుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో తలనొప్పి వచ్చి పడింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలను ఎదుర్కోవడానికి అవస్థలు పడుతున్న ఆయనకు విభజనపై పార్టీలోనే చిచ్చు ప్రారంభమైంది.

రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ రాయలసీమకు చెందిన పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో తెలంగాణ నాయకులు గుర్రుమంటున్నారు. విభజన తీరును వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్తే తమకు అభ్యంతరం లేదని, విభజనను వ్యతిరేకిస్తూ వెళ్తే మాత్రం సహించబోమని ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పార్టీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు పయ్యావుల కేశవ్‌పై కత్తులు నూరుతున్నారు.

తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యూవుల కేశవ్‌పై ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎర్రబెల్లి దయూకర్‌రావు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పయ్యూవుల కేశవ్‌ పార్టీ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఆయునపై పార్టీ క్రవుశిక్షణా చర్యలు తీసుకోవాలని ఎరబెల్లి దయకార్ రావు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర విభజన ప్రక్రియు అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పయ్యూవుల కేశవ్‌ పిల్‌ వేసిన నేపథ్యంలో ఎర్రబెల్లి తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో తలెత్తే సమస్యలు చెప్పుకోవచ్చని, అందుకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే విభజన ఆపాలని కోరడం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమని, ఇది పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని దయాకర్ రావు అన్నారు.

అయితే, తాము విభజనకు వ్యతిరేకం కాదని, విభజన తీరుకు మాత్రమే వ్యతిరేకమని సీమాంధ్రకు చెందిన సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చెప్పినప్పటికీ పయ్యావుల కేశవ్ విభజనను వ్యతిరేకిస్తుండడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+