అదానీ మెడకు హెరాయిన్ ఉచ్చు-ముంద్రాతో పాటు కృష్ణపట్నం పోర్టులోనూ ? సంబంధం లేదంటూ

దేశవ్యాప్తంగా ఉన్న పోర్టుల్ని ఒక్కొక్కటిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్న అదానీ పోర్ట్స్ కు తాజాగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన భారీ హెరాయిన్ డంప్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకోవడంతో కష్టాలు మొదలయ్యాయి. దీంతో అదానీ గ్రూప్ కు లింక్ ఉందా లేదా అన్న విషయాన్ని పక్కనబెడితే, ఇప్పుడు తాజాగా ఏపీలో అదానీ చేతుల్లోనే ఉన్న మరో పోర్ట్ కృష్ణపట్నంలోనూ హెరాయిన్ అక్రమ రవాణా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అదానీ గ్రూప్ దీనిపై వివరణ ఇచ్చింది.

 దేశంలోకి ఆప్ఘన్ హెరాయిన్

దేశంలోకి ఆప్ఘన్ హెరాయిన్

ఆప్ఘనిస్తాన్ లో తాజాగా మారిన పరిస్దితుల నేపథ్యంలో మాదకద్రవ్యాల ఎగుమతి భారీగా పెరిగింది. తాలిబన్లు అధికారంలోకి రాకముందే డ్రగ్స్ ను భారీ ఎత్తున విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పుడు అధికారం దక్కడంతో ఇక ఎగుమతులు మరింత తీవ్రతరం చేశారు. ఇదే క్రమంలో భారత్ లోని వివిధ పోర్టులకు అక్రమంగా హెరాయిన్ రవాణా అవుతున్న విషయం తాజాగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ నుంచి భారత్ కు భూ,వాయు మార్గాలు మూసేయడంతో సముద్ర మార్గం ద్వారా తాలిబన్లు లేదా వారి దళారులు భారత్ లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను ఎగుమతి చేస్తున్నట్లు నిర్ధారణ అవుతోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ద్వారా సముద్ర మార్గంలో భారత్ లోకి భారీగా హెరాయిన్ దిగుమతి అవుతున్న విషయం తేలడంతో అధికారులు నివ్వెరపోతున్నారు.

 ముంద్రా పోర్టు ఘటనతో

ముంద్రా పోర్టు ఘటనతో

విజయవాడకు చెందిన ఓ షెల్ కంపెనీ ద్వారా గుజరాత్ లోని ముంద్ర పోర్టుకు దాదాపు 9 వేల కోట్ల విలువైన హెరాయిన్ అక్రమ రవాణా అవుతుండగా.. డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ షెల్ కంపెనీ నిర్వహిస్తున్న దంపతుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. అయితే ప్రాధమిక దర్యాప్తు తర్వాత దీని విలువ 9 వేల కోట్లు కాదు దాదాపు రూ.23వేల కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. దీంతో దేశం నివ్వెరపోతోంది. అదే సమయంలో ఏపీలోని మరో పోర్ట్ నుంచి కూడా ఇదే విధంగా అక్రమ రవాణా జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ముంద్రా పోర్టు వివాదంలో ఇప్పటికే కీలకంగా మారిన ఏపీ ఇప్పుడు మరింత చిక్కుల్లో పడబోతోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య రాజకీయ మాటల యుద్ధం సాగుతోంది.

 కృష్ణపట్నానికీ లింకులు ?

కృష్ణపట్నానికీ లింకులు ?

ఆప్ఘనిస్తాన్ నుంచి భారత్ లోకి వస్తున్న హెరాయిన్ గుజరాత్ లోని ముంద్రా పోర్టులోనే కాదు ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్న కృష్ణపట్నం పోర్టులోనూ దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కృష్ణపట్నం పోర్టు ద్వారా కూడా ఆప్ఘన్ హెరాయిన్ దేశంలోకి ప్రవేశించినట్లు అర్ధమవుతోంది. ముంద్రా పోర్టుతో పోలిస్తే కార్యకలాపాలు తక్కువగా ఉండే కృష్ణపట్నం పోర్టును కూడా అక్రమార్కులు టార్గెట్ చేసి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. దీనిపై డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పుడు దృష్టిసారిస్తున్నారు. ముంద్రా పోర్టులో దొరికిన ఆధారాలతో తీగ లాగితే డొంక కదులుతున్నట్లు అర్ధమవుతోంది.

 అదానీ పోర్ట్స్ మెడకు హెరాయిన్ ఉచ్చు

అదానీ పోర్ట్స్ మెడకు హెరాయిన్ ఉచ్చు

గుజరాత్ లోని ముంద్రా పోర్టుతో పాటు ఏపీలోని కృష్ణపట్నం పోర్టు కూడా ఇప్పుడు అదానీ పోర్ట్స్ ఆధీనంలోనే ఉన్నాయి. ఈ రెండు పోర్టుల్లోనూ ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ హెరాయిన్ పట్టుబడినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఈ వ్వవహారం సహజంగానే అదానీ పోర్ట్స్ మెడకు చుట్టుకోబోతోంది. అదానీ ఆధ్వర్యంలోని పోర్ట్స్ ద్వారా ఇంత భారీ స్ధాయిలో హెరాయిన్ అక్రమ రవాణా జరుగుతుంటే ఇందులో ఎవరికి భాగస్వామ్యం ఉండి ఉండొచ్చనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఈ దందాకు సూత్రధారులు, పాత్రధారులపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో అదానీ పోర్ట్స్ సమాధానం చెప్పుకోలేక ఇరుకున పడుతోంది.

 తమకేం సంబంధం లేదన్న అదానీ గ్రూప్

తమకేం సంబంధం లేదన్న అదానీ గ్రూప్

అదానీ పోర్ట్స్ ఆధీనంలో ఉన్న ముంద్రా పోర్టు, కృష్ణపట్నం పోర్టుల్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హెరాయిన్ డంప్ లు దొరకడం, ఆ తర్వాత వస్తున్న విమర్శలపై అదానీ గ్రూప్ స్పందించింది. ఈ వ్యవహారంపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో పోర్టుల నిర్వహణ మాత్రమే తమ బాధ్యతని, ఎగుమతులు, దిగుమతులు, షిప్పింగ్ వ్యవహారాల్లో తమ పాత్రేమీ ఉండబోదని తేల్చి చెప్పింది. తమ ఆధీనంలోని రెండు పోర్టుల్లో హెరాయిన్ దిగుమతి విషయం తమకు తెలియదని అదానీ పోర్ట్స్ చెప్పకనే చెప్పింది. తద్వారా ఇదంతా దర్యాప్తు, నిఘా సంస్ధల బాధ్యత అని గుర్తు చేసింది. దీంతో ఇప్పుడు దర్యాప్తు సంస్ధలు కూడా ఇరుకునపడుతున్నాయి.

 అదానీలపై విమర్శల వెల్లువ

అదానీలపై విమర్శల వెల్లువ

వంద గ్రాములు హెరాయిన్ దొరికితేనే నానా హంగామా చేసే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్ధలు అదానీ పోర్ట్స్ ఆధీనంలో ఉన్న ముంద్రా పోర్టు, కృష్ణపట్నం పోర్టుల్లో ఙారీ హెరాయిన్ డంప్ లు దొరికితే కిమ్మనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతుంటే అదానీ గ్రూప్ తమకు ఏమీ తెలియదని చెప్పడంపైనా జనం మండిపడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అదానీ పోర్ట్స్ను నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. తమ పోర్టుల్లో ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే పోర్ట్స్ ని అదానీ గ్రూప్ నిర్వహిస్తుందా అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో అదానీ గ్రూప్ ఇచ్చిన వివరణ మరిన్ని విమర్శలకు తావిచ్చేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+