వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్ కు కాంట్రాక్టర్ల చుక్కలు-టెండర్లకు నో-సిండికేట్ గా మారి -షరతులకు అంగీకరిస్తేనే

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రోడ్లు భారీగా దెబ్బతిని ఉన్నాయి. వీటిని వెంటనే మరమ్మత్తులు చేయిస్తే సరిపోయేది. కానీ ప్రభుత్వం రెండేళ్లుగా వీటిని పట్టించుకోలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది మూడో వర్షాల సీజన్. వర్షాల సీజన్ కు ముందే రోడ్లు వేయడం ద్వారా ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ వైసీపీ సర్కార్ మాత్రం గత ప్రభుత్వంలో రోడ్లేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకూ డబ్బులు చెల్లించడం లేదు. దీంతో ప్రభుత్వం వారికి నమ్మకం సడలిపోయింది. ఇప్పుడు రోడ్లేసేందుకు టెండర్లు వేయడానికి బతిమాలుతున్నా వారు ముందుకు రావడం లేదు.

అధ్వాన్నంగా రహదారులు

అధ్వాన్నంగా రహదారులు

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లు అధ్వాన్న స్ధితికి చేరుకున్నాయి. రాష్ట్రంలో రెండేళ్లుగా వినిపిస్తున్న మాట ఇది. సీనియర్ ఎమ్మెల్యేలు, డిప్యుూటీ సీఎంలు, ఆఖరుకు సీఎం జగన్ కూడా తమ నియోజకవర్గాల్లో రోడ్లు వేయించుకునే పరిస్ధితుల్లో లేరు. ఏడాది క్రితం పాడైపోయిన రోడ్ల రిపేర్లకు రూ.2000 కోట్లు బ్యాంకు రుణం తీసుకునేందుకు ఏపీ రోడ్ల అభివృద్ధి సంస్ధకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. అయినా ఇప్పటికీ ఆ రుణమూ రాలేదు. కాంట్రాక్టర్లు రోడ్లు వేసేందకు ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వం ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా వాటిని పట్టించుకోకుండా కాలక్షేపం చేసేస్తోంది.

కాంట్రాక్టర్లకు భారీగా బకాయిలు

కాంట్రాక్టర్లకు భారీగా బకాయిలు

ఏపీలో రోడ్డు నిర్మాణం, మరమ్మత్తులు చేసే కాంట్రాక్టర్లకు అత్యవసరంగా నిధులు కేటాయించేవారు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాంట్రాక్టర్లకు మాత్రం ఇబ్బందులు ఉండేవి కావు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించేందుకు నిరాకరిస్తూ పెండింగ్ లో పెట్టేసింది. పలుమార్లు ప్రభుత్వం వద్ద పలు రకాలుగా లాబీయింగ్ లు చేసినా ఫలితం లేకపోవడంతో కొందరు కోర్టును కూడా ఆశ్రయించి పోరాడుతున్నారు. అయినా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిల మొత్తం ఇచ్చేందుకు ఇప్పటికీ వైసీపీ సర్కార్ సంసిద్ధత చూపడం లేదు. దీంతో కాంట్రాక్టర్లతో గ్యాప్ నానాటికీ పెరిగిపోతోంది.

టీడీపీ వారిగా ముద్ర వేసి

టీడీపీ వారిగా ముద్ర వేసి

రాష్ట్రంలో గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నా లేకపోయినా, విపక్షాలకు చెందిన కాంట్రాక్టర్లు అయినా చెల్లింపుల విషయానికొచ్చేసరికి ప్రభుత్వాలు పక్షపాతం చూపేవి కావు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం కాంట్రాక్టర్లపై టోకుగా టీడీపీ ముద్ర వేసేసింది. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తే అది టీడీపీ చేతుల్లోకే వెళ్తుందన్న భ్రమలోకి వైసీపీ సర్కార్ వచ్చేసింది. దీంతో వీరికి గత ప్రభుత్వంలో చేసిన పనులకు చెల్లింపులు చేయడం మానేసింది. ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్లి సంక్షేమ పథకాలకు ఖర్చుపెట్టేస్తోంది. దీంతో తమపై టీడీపీ ముద్ర వేసి బకాయిలు చెల్లించకపోవడంపై కాంట్రాక్టర్లు తీవ్ల అసంతృప్తిగా ఉన్నారు.

కొత్తగా పనులు చేసేందుకు నో

కొత్తగా పనులు చేసేందుకు నో

గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లుల బకాయిలు ఇప్పటివరకూ పూర్తిగా చెల్లించకపోవడంతో కొత్తగా మరో పని చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అది రోడ్లు రిపేరైనా, కొత్త రోడ్లు నిర్మాణం అయినా, ఏదైనా అదే లెక్క. ప్రభుత్వ పని అంటేనే కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం రోడ్ల రిపేర్లు కూడా చేయించుకోలేని పరిస్ధితికి చేరుకుంది. కొత్త రోడ్ల మాట ఎత్తేందుకు కూడా ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతోంది. ఇప్పటికే పాడై ఉన్న రోడ్లు రిపేర్ అయితే చాలనే పరిస్ధితికి ప్రభుత్వం చేరుకుంది. అయినా వాటికి కూడా కాంట్రాక్టర్లు మొగ్గు చూపడం లేదు.

సర్కార్ బతిమాలుతున్నా

సర్కార్ బతిమాలుతున్నా

గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నా కాంట్రాక్టర్లు మాత్రం ఈ మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. కొత్తగా ప్రభుత్వం పిలుస్తున్న టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పలుమార్లు టెండర్లు పిలుస్తున్నా, డెడ్ లైన్ లు పెడుతున్నా కాంట్రాక్టర్ల నుంచి పేలవమైన స్పందన కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం తరఫున ఇంజనీర్లు ఇప్పుడు వారిని బతిమాలుకునే పరిస్ధితుల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించే బాధ్యత తమదేనని వారికి ఇంజనీర్లు హామీ ఇస్తున్నారు. అయినా వారు మాత్రం ఇంజనీర్ల మాట నమ్మేందుకు సిద్ధంగా లేరు. దీంతో ఈసారి టెండర్లకు కూడా స్పందన లేకుండా పోతోంది.

కాంట్రాక్టర్ల డిమాండ్లు ఇవే

కాంట్రాక్టర్ల డిమాండ్లు ఇవే

రాష్ట్రవ్యాప్తంగా 1140 రోడ్లు రిపేర్ల పనులకు రెండు, మూడు సార్లు టెండర్లు పిలిచినా కేవలం 403 పనులకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. మిగతా పనులకూ టెండర్లు వేయాలని కాంట్రాక్టర్లపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. అయినా కాంట్రాక్టర్లు మాత్రం ససేమిరా అంటున్నారు. గతేడాది తమతో చేయించిన అత్యవసర రిపేర్లు, కేంద్ర రహదారి నిధి పేరుతో చేసిన పనులకు వెంటనే బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. ఈ రెండూ చెల్లింపులు పూర్తి చేస్తేనే కొత్తగా పనులు చేస్తామని వారు చెప్తున్నారు. దీంతో గత వారం అత్యవసర పనులకు ఇవ్వాల్సిన రూ.388 కోట్లకు గానూ, రూ.150 కోట్లు చెల్లించారు, కేంద్ర రహదారి నిధి పనుల్లో రూ.200 కోట్లకు గానూ రూ.20 కోట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో మిగతా డబ్బులు ఇస్తేనే కొత్త టెండర్లు వేస్తామంటున్నారు.

Recommended Video

AP CM Has Maintained His Cool In Pawan Kalyan Matter | Oneindia Telugu
చుక్కలు చూపిస్తున్న కాంట్రాక్టర్ల సిండికేట్ ?

చుక్కలు చూపిస్తున్న కాంట్రాక్టర్ల సిండికేట్ ?

జగన్ సర్కార్ గతంలో టీడీపీ హయాంలో తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో కొత్తగా పనులు చేసేందుకు ముందుకు రాకపోవడంతో పాటు కొత్తగా మరో పనీ ఒప్పుకోకుండా అంతా ఏకమవుతున్నారు. సిండికేట్ గా మారి ప్రభుత్వ పనులు ఎవరూ చేయరాదని తీర్మానాలు చేసుకుంటున్నారు. రేపు విజయవాడలో వీరంతా భేటీ అయిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం గతంలో చేసిన పనులకు రూపాయి రూపాయి సహా చెల్లిస్తే తప్ప కొత్తగా పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావద్దని వీరు కోరుతున్నారు. దీంతో జగన్ సర్కార్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓవైపు విపక్షాల నుంచి రోడ్లపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అక్టోబర్ చివరి లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్న సీఎం జగన్ ఆదేశాలు అమలవుతాయా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

English summary
road cotractors non-cooperation to ysrcp government in andhrapradesh due to long pending payment dues,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X