టి - 3 పదవులు: కెసిఆర్, కిరణ్ రిజైన్లపై హరీష్ పోలిక

మంగళవారం మెదక్‌జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద టిఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుండగా, బంగారు తెలంగాణ సాధన దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కేంద్రం ప్రకటించిన వివిధ రాయితీలతో పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే వీలుకలగనుండగా, కరుడుగట్టిన సమైక్యవాదులు చంద్రబాబు, కిరణ్ బాబు, జగన్ బాబుల కుట్రలు, కుతంత్రాలను ఇక్కడి ప్రజలు సంఘటితంగా ఉండి తిప్పికొట్టగా, యాత్రల పేరిట తెలంగాణ ప్రాంతంలో అడుగుపెడితే మరో మానుకోట సంఘటన పునరావృతమవుతుందని హెచ్చరించారు.
తెలంగాణ ప్రాంతానికి ఏ చిన్న అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని, యువత, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించగా, వారికే అంకితం చేస్తున్నట్లు చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మించుకుంటామన్నారు. ఎన్నికుట్రలు చేసినా ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామన్నారు. తెలంగాణ ప్రజలు తెరాస విలీనాన్ని కోరుకుంటలేరని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications