Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్‌ను తరిమేస్తాం: లోకేష్‌పై తెరాస సెటైర్, బాబుపై విజయసాయి

హైదరాబాద్/ఏలూరు: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిని తాము అసెంబ్లీలో మాట్లాడనిచ్చే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత కర్నె ప్రభాకర్, గువ్వల బాలరాజులు సోమవారం అన్నారు. రేవంత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పిన తర్వాతనే మాట్లాడనిస్తామని, లేదంటే అసెంబ్లీ నుండి తరిమి కొడతామన్నారు.

ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యాత్రలను సైతం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. హెరిటేజ్ పాలు తాగిన నారా లోకేష్.. అమూల్ బేబీలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్ మాట్లాడటం సరికాదన్నారు.

తెలంగాణలో మే 14న ఎంసెట్

TRS leaders demand for Revanth Reddy apology

తెలంగాణలో చదువుకోవాలంటే ఇక్కడ నిర్వహించే పరీక్షలు రాయాల్సిందేనని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్ష తేదీలను ఆయన ప్రకటించారు. మే 14న ఎంసెట్, 19న లాసెట్, 21న ఈసెట్, 22న ఐసెట్, 25న పీఈసెట్, జూన్ 6న ఎడ్‌సెట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏపీ కోరితే వాళ్లకు కూడా సేవలందించేందుకు సిద్ధమన్నారు.

చంద్రబాబు బండారం బయటపెడతాం: విజయ సాయి రెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోసాలని తాము బయటపెడతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని కార్యదర్శి విజయ సాయి రెడ్డి సోమవారం ఏలూరులో అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు మద్దతు తెలిపేందుకే జగన్ రెండు రోజుల దీక్షకు దిగుతున్నారన్నారు.

చంద్రబాబు మోసపూరిత విధానాలను బయటపెట్డడమే జగన్ తణుకు దీక్ష ఉద్దేశ్యమన్నారు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు వ్యక్తిత్వమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఒక్క హామీను కూడా వారు నెరవేర్చలేదన్నారు. రైతులు, డ్వాక్రా సంఘాలు, యువత ఇలా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+