వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవితతో పాటు కేకే, బీజేపీ సిద్ధమా: కేసీఆర్ ఒక్కరే మోడీతో..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు, జలహారం, మిషన్ కాకతీయలకు 50 శాతం నిధులు ఇవ్వాలని, గోదావరి పుష్కరాలకు రూ.750 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహితకు జాతీయ హోదా కల్పించాలన్నారు. ఏపీ హైకోర్టును తక్షణం ఏర్పాటు చేయాలని కోరారు. మహారాష్ట్ర నుండి డిచ్‌పల్లికి గ్రిడ్ కోరారు.

సోమవారంనాడు దాదాపు అరగంట సేపు మోడీతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన అమలుకాని అంశాలు ఎన్నో ఉన్నాయని, వాటిని సత్వరం పరిష్కరించాలని కోరారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలపై ఏపీ ప్రభుత్వం సహకరించడంలేదని, విద్యుత్‌లో వాటా, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల ఉల్లంఘన, నదీ జలాలకు సంబంధించి సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు.

కేబినెట్‌లో చేరుతారా?

ప్రధాని మోడీతో కేసీఆర్ సోమవారం జరిపిన ముఖాముఖి చర్చలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపైనా చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో తెరాస చేరడంపై ఇద్దరు నేతలు చర్చించారా? లేదా? అనేది స్పష్టం కావడం లేదు. కేంద్ర కేబినెట్‌లో తెరాస చేరే అవకాశాలు ఉన్నాయని, రెండు నెలల తరువాత జరిగే విస్తరణలో తెరాసకు అవకాశం ఇవ్వాలని మోదీ ఆలోచిస్తున్నట్టు జాతీయ టీవీలు ప్రసారం చేశాయి.

కేసీఆర్, మోడీ

కేసీఆర్, మోడీ

రాష్ట్రంలో చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు పెద్దఎత్తున నిధులివ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు., ప్రాణహిత- చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని, కాకతీయ, జలజాలం పథకాలకు భారీగా నిధులివ్వాలని మోడీకి విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్, మోడీ

కేసీఆర్, మోడీ

సోమవారం ప్రధాని అధికార నివాసం 7, ఆర్‌సిఆర్‌లో ప్రధాని మోడీతో అరగంటకు పైగా కేసీఆర్ ముఖాముఖి చర్చలు జరిపారు. ఎన్డీయే ప్రభుత్వం తెరాసలో చేరే అవకాశాలు ఉన్నట్టు కథనాలు వస్తున్న తరుణంలో కేసీఆర్ ఒక్కరే ప్రధాని నివాసానికి వెళ్లి చర్చలు జరపటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కే కేశవ రావు

కే కేశవ రావు

మోడీ కేబినెట్లో తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కే కేశవ రావుకు కూడా అవకాశం ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్లుగా సమాచారం.

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

టిఆర్ఎస్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరవచ్చునని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరుతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

మోడీకి చేరువవుతూ బంధం బలపర్చుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నార్నన కథనాలు వస్తూండటం తెలిసిందే. ఏపీతో పాటు తెలంగాణలో పార్టీని పటిష్టం చేయాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అధినాయకత్వం, తెరాసను కేంద్ర కేబినెట్‌లో చేర్చుకునేందుకు అంగీకరిస్తుందా? అనేది ప్రశ్న. ఏపీలో తెదేపాతో పొత్తు ఉన్నప్పటికీ, తమ పార్టీని విస్తరించేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రయత్నిస్తూండటం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తెలంగాణలోనూ బీజేపీని పటిష్టం చేసుకోవటం ద్వారా 2019లో జరిగే ఎన్నికల్లో సత్తా చూపించాలని అనుకుంటున్న బీజేపీ అధినాయకత్వం టీడీపీకి కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పించినందుకు బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెరాసను కేంద్ర కేబినెట్‌లో చేర్చుకునేందుకు బీజేపీ అధినాయకత్వం ఒప్పుకుంటుందా? అనేది చూడాలి.

English summary
Speculation was rife in political circles that the Telangana Rashtra Samiti would join the NDA government at the Centre, even as Chief Minister K. Chandrashekar Rao had a one-on-one meeting with Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X