మేం సంతోషంగా ఉండటం ఇష్టంలేకే, షీ టీం భేష్: కవిత (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో మహిళా సభ్యత్వ నమోదును నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బుధవారం ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వ పాలన పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీంల పనితీరు బాగుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండటం చూసి ఓర్వలేకనే విదేశాల నుండి పాలన చేస్తున్నట్లుందని చెప్పాడని కవిత ఆగ్రహించారు.

కల్వకుంట్ల కవిత
తెలంగాణ భవన్‌లో మహిళా సభ్యత్వ నమోదును నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బుధవారం ప్రారంభించారు. మొదట ఆమె సభ్యత్వం తీసుకున్నారు.

కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తొలి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

కల్వకుంట్ల కవిత
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కవిత మండిపడ్డారు. హైదరాబాదును విదేశాలతో పోల్చి చంద్రబాబు తెలంగాణ ప్రజలను అవమానించారని ధ్వజమెత్తారు.

కల్వకుంట్ల కవిత
2019లో రెండు రాష్ట్రాల్లో తాము అధికారంలోకి వస్తామని చంద్రబాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించడం విదేశాల్లో ఉండి పాలన సాగిస్తున్నట్లు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications