బాబు ఆలా, కెసిఆర్ ఇలా: కొప్పుల, విద్యాసాగర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కన్నా తమ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి మిన్న అనే పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. విద్యాసాగర్‌తో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

రైతు పంట రుణాల మాఫీపై తమ ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టమైన హామీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ాయుడు కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. రుణమాఫీపై ఎవరి చిత్తశుద్ధి ఏమిటో దీన్ని బట్టే అర్థమవుతోందని ఆయన అన్నారు.

TRS MLAs says KCR is better than Chandrababu

ఆ వాస్తవాన్ని విస్మరించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కెసిఆర్‌పై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. పోలవరం ఆర్డినెన్స్ పాపం చంద్రబాబు నాయుడిదేనని ఆయన అన్నారు. తెలంగాణ టిడిపి నేతలు ఈ అంశంపై చంద్రబాబును ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు.

కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడని ఆయన కొనియాడారు. ఏడాది గడువు ఇస్తే ఇచ్చిన హామీలను అన్నింటినీ కెసిఆర్ కచ్చితంగా అమలు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+