నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బతుకమ్మతో ఎంపి కవిత: ప్రదర్శన అద్భుతం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: బతుకమ్మ సంబరాలతో నిజామాబాద్ నగరం పులకించింది. సోమవారం అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలతో ఎటుచూసినా సందడి వాతావరణమే కనిపించింది. వీధివీధినా బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ బతుకమ్మ గేయాలు, ఆటపాటలతో వీధులను మార్మోగించారు. బతుకమ్మ కార్యక్రమానికి వేదికగా నిలిచిన కలెక్టరేట్ గ్రౌండ్ అయితే కిక్కిరిసిపోయింది. సుమారు 8వేల పైచిలుకు మంది మహిళలు, యువతులు, విద్యార్థినులు, ప్రజాప్రతినిధులు, మహిళా ఉద్యోగినులు తరలివచ్చి బతుకమ్మ ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు.

నగరంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితతో పాటు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్తా, హన్మంత్‌సింధే, బాజిరెడ్డి గోవర్ధన్, నగర మేయర్ ఆకుల సుజాత, కలెక్టర్ రొనాల్డ్‌రాస్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, వైస్ చైర్మెన్ గడ్డం సుమనారెడ్డి తదితరులు పాల్గొనగా, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఎస్పీ పాండునాయక్‌లు బందోబస్తును పర్యవేక్షించారు. మహిళలు బతుకమ్మ ఆటలాడుతూ, పాటలు పాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాల ప్రాధాన్యతను చాటి చెప్పారు.

అంతకుముందు నగర మేయర్ ఆకుల సుజాత నివాసంతో పాటు ఆర్‌బివిఆర్‌ఆర్ పాఠశాలలో, గంగాస్థాన్‌లోని తన స్వగృహంలోనూ తోటి మహిళలతో కలిసి స్వయంగా బతుకమ్మలను పేర్చారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన మీదట యెల్లమ్మగుట్ట కమాన్ నుండి కలెక్టరేట్ వరకు వేలాది మంది మహిళలతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ కళారూపాల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ర్యాలీ కన్నుల పండువగా ముందుకుసాగింది. అడుగడుగునా కోలాటాలు, దాండియా నృత్యాలతో యువతులు సందడి చేస్తూ తమకెంతో ప్రీతిపాత్రమైన బతుకమ్మ ఉత్సవాల్లో హుషారుగా పాల్గొన్నారు.

రంగురంగుల విద్యుద్దీప కాంతుల నడుమ కలెక్టరేట్ గ్రౌండ్ ధగద్ధగాయమానంగా వెలుగొందింది. తీరొక్క పూలను పేర్చి తయారు చేసిన బతుకమ్మలను మైదానం మధ్యలో ఉంచి మహిళలు బృందాలుగా ఏర్పడి బతుకమ్మ ఆటపాటలతో ఉత్సవ శోభను పతాకస్థాయికి చేర్చారు. తెరాస ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఈ వేడుకకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా యంత్రాంగం చేపట్టిన విస్తృత ఏర్పాట్ల నడుమ బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

అబ్బురపర్చిన ప్రదర్శన

అబ్బురపర్చిన ప్రదర్శన

తెలంగాణ కళారూపాల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ బతుకమ్మల ర్యాలీ కన్నుల పండువగా ముందుకుసాగింది.

కవిత

కవిత

బతుకమ్మ సంబరాలతో నిజామాబాద్ నగరం పులకించింది. సోమవారం అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలతో ఎటుచూసినా సందడి వాతావరణమే కనిపించింది.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

వీధివీధినా బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ బతుకమ్మ గేయాలు, ఆటపాటలతో వీధులను మార్మోగించారు. బతుకమ్మ కార్యక్రమానికి వేదికగా నిలిచిన కలెక్టరేట్ గ్రౌండ్ అయితే కిక్కిరిసిపోయింది.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

సుమారు 8వేల పైచిలుకు మంది మహిళలు, యువతులు, విద్యార్థినులు, ప్రజాప్రతినిధులు, మహిళా ఉద్యోగినులు తరలివచ్చి బతుకమ్మ ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

నగరంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితతో పాటు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

బతుకమ్మ ఆడుతూ..

బతుకమ్మ ఆడుతూ..

మహిళలు బతుకమ్మ ఆటలాడుతూ, పాటలు పాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాల ప్రాధాన్యతను చాటి చెప్పారు.

English summary
Telangana Rashtra Samithi MP Kavitha on Monday participated Bathukamma celebrations in Nizamabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X