వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఇచ్చినా కాంగ్రెసులో విలీనం చేయం: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చం ద్రశేఖరరావు స్పష్టం చేశారు. తమ పార్టీ స్వతంత్ర శక్తిగానే కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ నియో జకవర్గ ఇన్‌చార్జిల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈనెల 29న హైదరాబాద్‌లో తలపె ట్టిన సకల జన భేరి సభకు భారీగా ప్రజలను సమీకరించాలని నేతలను ఆదేశిం చారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపిఎన్జీవోలు ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సభకు ధీటుగా ఈ సభను నిర్వహిస్తున్నందున తెలంగాణసత్తా ఏమి టో చూపించాలని సూచించారు. తెలంగాణవచ్చే సమయంలో సీమాంధ్రులు ఢిల్లీలో లాబీయింగ్‌తో అడ్డుకోవాలని చూస్తున్నారని వారి ఆటలు సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు.

సీమాంధ్రులు రాష్ట్ర విభజన విషయంలో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ రాజధాని హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థిత్లుల్లోనూ వదులుకునేది లేద ని తెగేసి చెబుతున్నారని అన్నారు. హైదరాబాద్‌ నగరం కేవలం తెలంగాణ ప్రజలదేననీ, దానిపై సీమాంధ్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ హక్కు లేదని సకల జన భేరి సభతో నిరూపించాలని చెప్పారు.

హైదరాబాద్‌ నిజాం ప్రభువుల కాలంలోనే అభివృద్ధి చెందిందనీ, దీనికి సీమాంధ్రులు చేసింది ఏమీ లేదని అన్నారు. ఇదే విషయాన్ని ఈ నెల 29న నిర్వహిస్తున్న సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తామని తెలిపారు.

English summary
Telangana Rastra Samithi (TRS) president K chandrasekhar Rao has clarified that TRS will not be merged in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X