రెండో'సారీ': ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్‌ను పిలిచి మరీ తిట్టారు!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన.. టీఆర్ఎస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - బీజేపీలకు మద్దతిచ్చిన పవన్.. అవసరమైనప్పుడు తాను ప్రశ్నిస్తానని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ రెండుమూడుసార్లు బయటకు వచ్చారు. విపక్షాలు ఆయన పైన విమర్శలు గుప్పించాయి. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందుకు బయటకు రావడం లేదని నిలదీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల విషయంలో విపక్ష వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు పవర్ స్టార్‌ను నిలదీశాయి. కొద్ది రోజుల తర్వాత ఆయన స్పందించారు. తాజాగా, ఓటుకు నోటు, సెక్షన్ 8 అంశాల పైన పవన్ కళ్యాణ్ స్పందించడం లేదేమని కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ నేతలు దాదాపు రోజు మాట్లాడారు.

దీంతో, మరోసారి ఆయన బయటకు వచ్చారు. రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఈసారి అన్ని పార్టీలను ఏకిపారేశారని చెప్పవచ్చు. ప్రత్యేక హోదా పైన టీడీపీ ఎంపీలను నిలదీశారు. సెక్షన్ 8 వద్దని చంద్రబాబుకు సూచించారు.
మరోవైపు, ఆంధ్రొళ్లు అనొద్దని కెసిఆర్‌కు, తెరాస నేతలకు సూచించారు. అయితే, ఆయన వ్యాఖ్యల పైన అన్ని పార్టీలు మండిపడుతున్నాయి. ఓటుకు నోటుపై స్పందించలేదేమని టీఆర్ఎస్, వైసీపీ ధ్వజమెత్తగా, సెక్షన్ 8, ప్రత్యేక హోదాపై మమ్మల్ని ప్రశ్నిస్తారా అని టీడీపీ నిప్పులు చెరిగింది.












Click it and Unblock the Notifications