ఆంధ్రాలో మళ్లీ తెలంగాణను కలుపుతారేమో..? : మంత్రి హరీష్ రావు
ఆంధ్రప్రదేశ్ విభజన లోపభూయిష్టంగా ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతుంది. తెలంగాణ ప్రజలకు అవమానపరిచేలా మోదీ మాట్లాడారంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, నిరసలకు దిగారు. ప్రదాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ జాతికి మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అటు పార్లమెంటులోనూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రివిలేజ్ నోటీసులు కూడా ఇచ్చారు. ఇవాళ రాజ్యసభను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆంధ్రాలో మళ్లీ తెలంగాణను కలిపినా ..
తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆంధ్రాలో మళ్లీ తెలంగాణను కలిపినా కలుపుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై మోదీ తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నేతృత్వంలో దూసుకెళ్తున్న తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక మోదీ అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడిన అమరులను ప్రజలను పార్లమెంటు సాక్షిగా అవమానపరిచారని దుయ్యబట్టారు.

బీజేపీకి ఇక నూకలు చెల్లాయి..
..
తెలంగాణ ప్రజల త్యాగాలను , ఆకాంక్షలను చిన్నగా చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ మాట్లాడడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో నాడు పార్లమెంటులో మూజువాణి ఓటుతో ఎలా బిల్ పాస్ చేశారని మోదీని, బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీకి ఇక నూకలు చెల్లాయని విమర్శించారు.

తెలంగాణ ప్రజలను కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు
తెలంగాణ సమాజాన్ని కించపరిచిన మోదీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఎలా సమర్థిస్తారని హరీష్ నిలదీశారు. దేశంలోని ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయన్నారు. కేంద్రం సాయం చేయకున్నా.. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. దేశంలో ఏడు బైస్ట్ గ్రామాలలో ఏడు తెలంగాణకే వచ్చాయంటే తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు.

కుంభమేళా పెడితే కరోనా పెరగలేదా..?
దేశంలో వలస కార్మికుల వల్లే కరోనా వ్యాప్తి పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం సిగ్గుచేటని హరీష్ రావు ఫైర్ అయ్యారు.. కుంభమేళా పెడితే కరోనా పెరగలేదా..? అని నిలదీశారు. ట్రంప్ సభలు, ఎలక్షన్ ర్యాలీలతో కరోనా పెరగలేదా అని మంత్రి ప్రశ్నించారు. మోదీ పాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. పేదలను పట్టించుకోకుండా పెద్దలకే బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను, రైతులను నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications