విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సునామీకి 12ఏళ్లు: సముద్ర తీరంలో గంగమ్మ తల్లికి మహిళల శాంతి పూజలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: చల్లంగ చూడమ్మా... గంగమ్మా తల్లీ.. అంటూ వేడుకున్నారు మత్స్యకార మహిళలు. సునామీ వచ్చి 12 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో మత్స్యకార గ్రామాల ప్రజలు శనివారం ఉదయం శాంతిపూజలు చేశారు.

ఈ సందర్భంగా చిన్నాపెద్దా అంతా ఉదయాన్నే స్నానాలు చేసి కొత్త దుస్తులు ధరించి పసుపు, కుంకుమ కలిపిన కలశాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా బయలుదేరారు. వేలాది మంది మత్స్యకార మహిళలు, పురుషులు వేటకు సైతం వెళ్లకుండా బాజాభజంత్రీలతో ఉత్సాహంగా సముద్ర తీరానికి చేరుకున్నారు. ఒడ్డున ఇసుక గుట్టలు పెట్టి పసుపు, కుంకుమతో పూజలు చేశారు.

అనంతరం సముద్రంలో పాలు, పసుపు నీటిని గంగలో కలుపుతూ కరుణించి కాపాడాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా తీరంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పులి వేషాలతో దారిపొడవునా నృత్యాలు చేశారు.

గంగమ్మ జాతర

గంగమ్మ జాతర

చల్లంగ చూడమ్మా... గంగమ్మా తల్లీ.. అంటూ వేడుకున్నారు మత్స్యకార మహిళలు.

గంగమ్మ జాతర

గంగమ్మ జాతర

సునామీ వచ్చి 12 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో మత్స్యకార గ్రామాల ప్రజలు శనివారం ఉదయం శాంతిపూజలు చేశారు.

గంగమ్మ జాతర

గంగమ్మ జాతర

ఈ సందర్భంగా చిన్నాపెద్దా అంతా ఉదయాన్నే స్నానాలు చేసి కొత్త దుస్తులు ధరించి పసుపు, కుంకుమ కలిపిన కలశాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా బయలుదేరారు.

గంగమ్మ జాతర

గంగమ్మ జాతర

వేలాది మంది మత్స్యకార మహిళలు, పురుషులు వేటకు సైతం వెళ్లకుండా బాజాభజంత్రీలతో ఉత్సాహంగా సముద్ర తీరానికి చేరుకున్నారు.

గంగమ్మ జాతర

గంగమ్మ జాతర

ఒడ్డున ఇసుక గుట్టలు పెట్టి పసుపు, కుంకుమతో పూజలు చేశారు.

గంగమ్మ జాతర

గంగమ్మ జాతర

అనంతరం సముద్రంలో పాలు, పసుపు నీటిని గంగలో కలుపుతూ కరుణించి కాపాడాలని ప్రార్థించారు.

గంగమ్మ జాతర

గంగమ్మ జాతర

ఈ సందర్భంగా తీరంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పులి వేషాలతో దారిపొడవునా నృత్యాలు చేశారు.

గంగమ్మ జాతర

గంగమ్మ జాతర

కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి శ్రీనివాస వంశీకృష్ణయాద్‌ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కొర్పొరేటర్‌ పేర్ల విజయచందర్‌, గ్రామపెద్ద తెడ్డు పరసన్న, దాసరాజు, కారి శ్రీలక్ష్మి, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

English summary
Hundreds of fishermen participated in a procession to appease the goddess of water, Gangamma, here on the occasion of the 12th anniversary of tsunami on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X